Mint Leaves: పుదీనా ఆకుల నీటిని గోరువెచ్చగా తాగితే..!?

Share

Mint Leaves: మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. అయితే నేటి మన ఆహారపు అలవాట్లు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. వయస్సుతో భేదం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అసిడిటీ..!! ఈ సమస్య వచ్చినప్పుడు ఛాతిలో మంట, అసౌకర్యం, పుల్లని త్రేన్పులు ఇబ్బందికి గురి చేస్తాయి.. అసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం కలగాలంటే పుదీనా ఆకులు అద్భుతంగా పని చేస్తాయి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..!!

Mint Leaves: water to check Acidity
Mint Leaves: water to check Acidity

పుదీనా ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఆయుర్వేద వైద్యం లో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వంటింటి చిట్కాల లోనూ వీటి స్థానం ప్రత్యేకం. పుదీనా ఆకులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయి. అందుకే వీటిని పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో వినియోగిస్తారు. పరగడుపున పుదీనా ఆకులు నమిలి మింగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు దరి చేరనివ్వకుండా చేస్తుంది.

Mint Leaves: water to check Acidity
Mint Leaves: water to check Acidity

ఎసిడిటి సమస్యను తగ్గించడానికి పుదీనా ఆకులు గ్రేట్ గా పనిచేస్తాయి. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఐదు పుదినా ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. నీరు రంగు మారిన తర్వాత ఆ నీటిని ఒక గ్లాసు లోకి పోసుకోవాలి. గోరు వెచ్చగా ఉన్న ఈ నీటిని తాగితే ఎసిడిటీ నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. చాతిలో మంట, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుంచి తక్షణమే రిలీఫ్ ను అందిస్తుంది.


Share

Related posts

Chandra Babu Naidu: వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ చంద్రబాబు సీరియస్ కామెంట్స్

somaraju sharma

ఏపి అసెంబ్లీలో రెండవ రోజు రగడ..టీడీపీ సభ్యుడు రామానాయుడు సస్పెన్షన్

somaraju sharma

Lasya Manjunath : గోవాలో లాస్య మంజునాథ్.. ఎంజాయ్ మెంట్ అంటే ఇది?

Varun G