Modi Immanuel Macrone: ఇటీవల జరిగిన ఫ్యాన్స్ అధ్యక్ష ఎన్నికలలో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మరోసారి ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి మెరైన్ లీపెన్ నీ ఓడించి పగ్గాలు చేపట్టారు. ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ విజయంతో ఫ్రాన్స్ లో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. దాదాపు జరిగిన ఎన్నికలలో ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో… విజయం కైవసమై ఉంది. విజయం సాధించిన తర్వాత ఇమ్మాన్యుయేల్… మాట్లాడుతూ దేశంలో చాలామంది నాకు ఓటు వేశారు అంటే నా ఆలోచనలకు వారు మద్దతు తెలుపుతున్నారు.
అతిగా బాధించే వారిని దూరంగా ఉంచాలని వారందరూ తీర్పునిచ్చారు. ఓటు వేసిన వారందరికీ నా ధన్యవాదాలు. ఫ్రాన్సు దేశంలో ఏ ఒక్కరి పట్ల ద్వేషం గాని విపక్ష గాని చూపించమంటూ… ప్రకటన చేయడం జరిగింది. ఫలితాల అనంతరం ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గెలుపు వార్త వచ్చాక ప్రధాని మోడీ సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేశారు. నా స్నేహితుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. మళ్లీ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా గెలవటం నిజంగా అభినందనీయం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారత్ – ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేలా కలిసి పని చేయాలని అనుకుంటున్నాను.. అంటూ ప్రధాని మోడీ కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే.. మే 2 నుండి 6 వరకు యూరప్ లో ప్రధాని మోడీ పర్యటన ఉంది. ఈ క్రమంలో ప్యారిస్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నీ స్వయంగా కలిసి మోడీ అభినందించిన ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో పాటు జర్మనీ ఛాన్స్ లర్ ఒల్లాఫ్.. స్కాల్జ్ తో కూడా బేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇండియా- ఫ్రాన్స్ మధ్య మంచి సంబంధం ఉంది. రక్షణ ఉత్పత్తి తయారీ విషయంలో ఆత్మ నిర్భర్ భారత్ కి ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతుగా ఉంది.