NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్ పై మరి కొన్ని అభియోగాలు .. బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసి 14 రోజులు రిమాండ్ విధించిన ఢిల్లీ కోర్టు

Mohammed Zubair: హిందూ దేవతలను అవమానించాడన్న అభియోగాలతో అరెస్టైన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు (Alt News Co Founder) మహమ్మద్ జుబైర్ (Mohammed Zubair) పై ఢిల్లీ (Delhi) పోలీసులు తాజా అభియోగాలను మోపారు. నేరపూరిత కుట్ర, అధారాల చెరిపివేత సహా విదేశీ విరాళాల చట్టం ప్రకారం మరిన్ని సెక్షన్ లు చేర్చినట్లు పోలీసులు వివరించారు. కస్టోడియల్ విచారణ ముగిసిన నేపథ్యంలో జుబైర్ ను పోలీసులు ఈ రోజు న్యాయస్థానం ముందు హజరుపర్చి జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు. ఆల్ట్ న్యూస్ పేరెంట్ కంపెనీ ప్రవ్డా మీడియా విదేశాల నుండి రూ.2,31,933 లు విరాళాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకాక్, ఆస్ట్రేలియా, మనామా, నార్త్ హోలండ్, సింగపూర్, విక్టోరియా, న్యూయార్క్, ఇంగ్లాండ్, రియాద్, షార్జా, అబుదాబి, స్టాక్ హోమ్, వాషింగ్టన్, కన్సాస్, న్యూజెర్సీ, ఒంటారియో, కాలిఫోర్నియా, టెక్సాస్, దుబాయ్, స్టాట్ లాండ్ వంటి ప్రాంతాల నుండి విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు. జుబైర్ అరెస్టు తరువాత ఆయనకు మద్దతుగా వచ్చిన ట్వీట్ల ఖాతాలు.. యూఏఈ, బహ్రేయిన్, కువైట్, పాకిస్తాన్ వంటి దేశాల కు చెందినవని పేర్కొన్నారు.

Mohammed Zubair Denied Bail, Faces Fresh Allegations
Mohammed Zubair Denied Bail Faces Fresh Allegations

 

ఇదే క్రమంలో తనకు బెయిల్ ఇప్పించాలని జుబైర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన విచారణ పూర్తైయిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు సీజ్ చేసిన ఫోన్ నుండి తాను ఆ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. “ఆ ట్వీట్ 2018కి సంబంధించినది, అప్పుడు నేను వాడిన ఫోన్ ఇది కాదు. నేను ఆ ట్వీట్ ను ఖండించడం లేదు” అని జుబైర్ తన న్యాయవాది ద్వారా కోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే జుబైర్ పై నేరపూరిత కుట్ర, ఆదారాల చెరిపివేత సహా విదేశీ విరాళాల చట్టం ప్రకారం మరి కొన్ని సెక్షన్లు జోడించిన నేపథ్యంలో కోర్టు.. బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసి, 14 రోజులు రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సెక్షన్ల నమోదుతో జుబైర్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. మహ్మద్ జుబైర్ తన ట్వీట్ ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న అభియోగాలపై గత నెల 27న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు ట్రయల్ కోర్టు ఒక రోజు పోలీసు కస్టడీకి పంపింది. ఒక టీవీ షోలో మహ్మద్ ప్రవక్తపై బీజేపి బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వీడియోను ఫ్లాగ్ చేసిన ఒక రోజు తర్వాత పోలీసులు జుబైర్‌ని అరెస్టు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju