మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిన్న మెగా అభిమానులంతా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కరోనా కారణంగా ఎవరు ఇళ్లలోనే వారు ఉండి ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ ని చూసి తరించి సంబరాలు జరుపుకున్నారు. ఇదే సమయంలో చిరంజీవికి దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే వారి అందరి కన్నా భిన్నంగా మోహన్ బాబు చిరుకి మరిచిపోలేని కానుక పంపించారు. ప్రముఖ మోటార్ సైకిల్ బ్రాండ్ ‘హార్లీ డేవిడ్సన్’ బండి ఆర్ట్ ఫార్మ్ ని పుట్టినరోజు కానుకగా మెగాస్టార్ కి బహుకరించారు. పూర్తిగా చెక్కతో చేయబడిన ఈ బండిని చూసేందుకు నిజం బండి లాగానే ఉంది. దీనిని చిరు సోషల్ మీడియాలో పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు.
“నా చిరకాల మిత్రుడు తొలిసారి నా పుట్టినరోజు నాడు ఒక కళాకృతి నాకు ని కానుకగా పంపాడు. ఈ కానుక లో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి…. థాంక్యూ మోహన్ బాబు” అంటూ చిరు పోస్ట్ చేశారు. నిజంగా చూసేందుకు హార్లీ డేవిడ్సన్ లాగే ఉన్న ఆ కళాత్మక బైక్ మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులను కూడా అబ్బురపరిచింది. ముందు నుండి చిరంజీవి…. మోహన్ బాబు మధ్య ఉండే సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. ‘మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ అంతా ఏకమే అని చెప్పేందుకు నిర్వహించిన ఒక మీటింగ్ లో కూడా ఆప్యాయంగా ఇద్దరూ హత్తుకొని ముద్దాడుకున్నారు.
ఇకపోతే ‘ఆచార్య’ సినిమాలో విలన్ గా నటించేందుకు కొరటాల శివ…. మోహన్ బాబుని సంప్రదింపులు జరిపారని కూడా వార్తలు వచ్చాయి వాటిలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ మోహన్ బాబు…. చిరంజీవి కి ఇచ్చిన బహుమానం అయితే నిజంగా అదిరిపోయింది అనే చెప్పాలి.