బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి వింత వింత ఘటనలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజుకో మలుపుతో బిగ్ బాస్ హౌస్ పై ఆసక్తి పెరిగిపోతుంది. ఇక అలానే మొన్న నామినేషన్స్ ప్రక్రియ ఎంత ఘాటుగా జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఒకొక్కరిని నామినేట్ చేస్తూ ఒక్కో రీజన్ చెప్పడం.. ఆ రీజన్ విన్నవారు ఫైర్ అవ్వడం ఎపిసోడ్ మొత్తం గొడవలు గొడవలు అయ్యాయి.
ఇక ఈ ఎలిమినేషన్స్ లోనే ఒక సరికొత్త డ్రామా జరిగింది. అప్పటికే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మునిగిపోయిన మోనాల్ గజ్జర్, అఖిల్, అభిజిత్ కి మొన్న ఎలిమినేషన్స్ గట్టి షాక్ ఏ ఇచ్చాయ్. ప్రతి ఒక్కరూ అఖిల్ ని నామినేట్ చెయ్యడం.. అఖిల్ కాస్తా అభిజిత్ పై ఫైర్ అవ్వడం వంటివి చెయ్యడం ఇంకా ఆతర్వాత అబీజీత్ కాస్త అఖిల్ ని నామినేట్ చెయ్యడం వంటివి చేసే సమయంలో పెద్ద రచ్చే జరిగింది.
ఇక ఆ రచ్చలో బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎవరంటే మోనాల్ గజ్జర్ ఏ. మోనాల్ ని నామినేషన్స్ లోకి తీసుకురావడం ఆమెను కాస్త కార్నర్ చెయ్యడం వాటి వల్ల మోనాల్ కన్నీరు పెట్టుకుంది. దీంతో అబీజీత్ కి, అఖిల్ కి ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూషన్ లో ఉండగా.. అబీజీత్ మోనాల్ వద్దకు వెళ్లి ఎక్సప్లయిన్ చెయ్యడం ఆతర్వాత ఇద్దరు ఒకరి చేతిలో ఒకరి సైన్ పెట్టుకోవడం హగ్ ఇచ్చుకోవడం చెయ్యగా..
ఆతర్వాత అఖిల్ తో కూడా ఆ విషయాలు మాట్లాడటం.. అవి కాస్త హైలెట్ గా మారడం.. అతనికి హగ్ ఇవ్వడం చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మోనాల్ గజ్జర్ నిజంగా చాలా గేమ్స్ ఆడుతుంది.. కన్నీళ్లు పెట్టుకొని హైడ్రామా ప్లే చేస్తుంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం మోనాల్ పై పాజిటివ్ కంటే కూడా నెగిటివిటినే ఎక్కువ ఉండడం అందరిని షాక్ కి గురి చేస్తుంది.