గుజరాతి బ్యూటీ మోనాల్ గజ్జర్ ను బిగ్బాస్ ఇంటిలో కేవలం గ్లామర్ కోసమే అన్నిరోజులు ఉంచారు అన్న విమర్శలు ఎన్నో వచ్చాయి. 13 వారాలు ఇంటిలో తన ప్రయాణాన్ని కొనసాగించింది monal gajjar ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో బాగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ ఇంటినుండి బయటికి వచ్చే సమయానికి మోనాల్, అఖిల్ ఒక్కటయ్యారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇంటి నుండి బయటకు వచ్చిన మోనాల్ అనేక ఆఫర్లు అందుకోవడం మొదలుపెట్టింది.
డాన్స్ ప్లస్ జడ్జిగా ఆఫర్ అందిపుచ్చుకుని తనదైన శైలిలో ఎక్స్పోజింగ్ చేస్తూ హాట్ హాట్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా డాన్స్ ప్లస్ షో కు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటకు ఒక కంటెస్తెంట్ డ్యాన్స్ చేశాడు. ఆర్య 2 లో ఉప్పెనంత ఈ ప్రేమకు అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ పాట తన ఫేవరెట్ అని యువ డాన్స్ మాస్టర్ యశ్ చెప్పుకొచ్చాడు.
ఇదే క్రమంలో రఘు మాస్టర్, యశ్ ఇద్దరు కలిసి స్టేజి పైన ఆ పాటకు డాన్స్ చేశారు. ఇక రఘు మాస్టర్ ని పోలిస్తే మోనాల్ దగ్గరకు యశ్ ఎందుకు వెళ్ళాడు అంటూ యానీ మాస్టర్ కౌంటర్ వేసింది. ఇక వీరు ముగ్గురూ కలిసి డ్యాన్స్ వేస్తున్నప్పుడు యశ్ భార్య అక్కడికి వచ్చింది. దీంతో అందరూ కలిసి యశ్ ను అతని భార్యను ఇరికించే ప్రయత్నం చేశారు.
పింక్ గిటార్ పైన యశ్ కన్ను పడింది అని మొన పైన దృష్టి పడింది అని మిగతా వారు కౌంటర్లు వేశారు. ఇక దీనితో యశ్ భార్య బాగా ఫీల్ అయింది. వెంటనే యాని మాస్టర్ అందుకని పప్పు పప్పే… బిర్యానీ బిర్యానీ యే అంటూ కౌంటర్ వేసింది. దీంతో యశ్ భార్య రావడంతోనే మోనాల్ పక్కకు వెళ్లిపోయింది. తనకు సంబంధం లేదంటూ సైడ్ అయిపోయింది. మీది మీరు చూసుకోండి అని చివరికి యశ్ పైన కౌంటర్ వేసింది.