ట్రెండింగ్ సినిమా

Review : రివ్యూ – ‘మోసగాళ్లు’ ట్రైలర్

Share

Review :  మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రామిసింగ్ హీరో విష్ణు గత కొద్ది ఏళ్ళగా నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సరైన ఫలితాలు రాబట్టలేకపోయాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’ ఆ తర్వాత చేసిన ‘ఓటర్’ సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇప్పుడు మంచు విష్ణు ‘మోసగాళ్లు’ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

 

Mosagallu trailer Review
Mosagallu trailer Review

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పోస్టర్ కి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

సినిమా విషయానికి వస్తే…. 2016 లో జరిగిన 450 మిలియన్ డాలర్ల స్కామ్ నేపథ్యంలో దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో విష్ణు నటిస్తున్నాడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ కావడం విశేషం. ఇంకా ముఖ్య పాత్రల్లో నవీన్ చంద్ర, నవదీప్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

ట్రైలర్ రివ్యూ :

ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి గొప్పవాడు కావాలని కలలు కనే వ్యక్తిగా హీరో విష్ణు కనిపిస్తుంటే కాజల్ అగర్వాల్ అతనికి సహకరిస్తూ ఉంటుంది. ఇక వీరికి నవదీప్ కాంటాక్ట్స్ తోడు అవుతాయి. ఇంకేముంది అత్యాధునిక రీతిలో దోపిడీ మొదలెడుతారు. ఇలా స్కామ్ చేసి దొంగతనం చేసిన డబ్బులు మొత్తం జాగ్రత్తగా భద్రపరిచేందుకు నవీన్ చంద్ర ఉపయోగపడతాడు.

దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ ను వీరు చేస్తారు. అమెరికాలోని ఐటి కంపెనీలను మోసగించి వీరు చేసిన వల్ల భారతదేశ ఎకానమీ కే ప్రాబ్లం వస్తుంది. ఈ సమయంలో అసలు ఇదంతా ఎవరు చేశారో వారిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా సునీల్ శెట్టి రంగంలోకి దిగుతాడు. అయితే ఇంటర్నెట్ ద్వారా చేసిన స్కామ్ లో వారిని పట్టుకునే ఛాన్స్ లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ లో హీరో ఉంటాడు.

మరి సునీల్ శెట్టి వీరిని పట్టుకున్నాడా…? వీరు దొరికిన తర్వాత కూడా వీరిపై నేరం రుజువు అయిందా… లేదా…? అన్నదే చిత్ర కథాంశం తెలుస్తోంది. ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. “లక్ష్మీదేవికి ఎందుకు అంత డబ్బు అంటే…. ఆమె నాలుగు చేతులా సంపాదిస్తుంది కనుక” అని కాజల్ అగర్వాల్ చెబుతోంది. అలాగే “డబ్బున్న వాడి దగ్గర దోచుకోవడంలో తప్పే లేదు” అనే డైలాగ్ కూడా బాగా పేలింది. మొత్తానికి స్క్రీన్ ప్లే, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులని మెప్పించింది అనే చెప్పాలి.


Share

Related posts

ఓ రెడ్డి, ఇంకో చౌద‌రి…ఆమెపై 139 మంది అత్యాచారం?

sridhar

మరోసారి పాఠాలు చెబుతున్న సుకుమార్..??

sekhar

Pomegranate Leaves: ఈ ఆకులు అందరికీ తెలిసినవే..!! దీని ప్రయోజనాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar