Most Eligible Bachelor: ఓటిటిలో సందడి చేయనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఎప్పుడంటే..!?

Share

Most Eligible Bachelor: అక్కినేని అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఈ రొమాంటిక్ మూవీ ఎంటర్టైనర్ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు.. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి సినిమా తో ఏకంగా బ్లాక్ బాస్టర్ లభించింది.. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా థియేటర్లలో విడుదల కాగా మొదటి రోజు నుంచి సాలిడ్ రివ్యూలను సొంతం చేసుకుంది.. తాజాగా ఈ సినిమా ని ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్..!!

Most Eligible Bachelor: release on Aha and Netflix
Most Eligible Bachelor: release on Aha and Netflix

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన 35 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల కాబోతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని నవంబర్ 19న ఆహా, నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇప్పటికీ ఈ సినిమా రూ. 2.75 కోట్ల లాభం లాభాలను గడించింది. అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ ఈ చిత్రం గా నిలిచింది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని సమకూర్చారు.

Most Eligible Bachelor: release on Aha and Netflix
Most Eligible Bachelor: release on Aha and Netflix

అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా లోని ప్రతి పాట యువతను మెప్పించాయి. యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని ఆహా, నెట్ ఫ్లిక్స్ రెండు ఓటిటి ప్లాట్ఫామ్స్ లో విడుదల చేయడం మరో విశేషం. అఖిల్ కెరియర్లో హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్ పై ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Share

Related posts

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి

somaraju sharma

శ్రావణి హత్య కేసు: ఆ ముగ్గురు అబ్బాయిలు ఎవరు… ఈమె కోసం ఎందుకు పడి చచ్చారు??

sowmya

జబర్దస్త్ లో అవినాష్ కు మళ్లీ నో ఎంట్రీకి కారణం ఆ కంటెస్టెంటేనట? అందుకే వద్దన్నారట?

Varun G