18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్

Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అత్యంత విజయవంతమైన ఇండియా బ్రాండ్‌లు..!!

Share

Republic Day: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో జరిగిన వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అల్-సిసీ హాజరు కావడం జరిగింది. ఎంతో దుర్భరమైన పరిస్థితిలో కటిక పేదరికం నిరాక్ష్యరాస్యత తాండవించిన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశంగా ఆవిర్భవించి కీర్తించబడుతుంది. విద్య వైద్యం ఇంకా అన్ని రకాలుగా దేశం ఆత్మవిశ్వాసం కలిగి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచంలో ప్రస్తుతం అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఆయా దేశాల ప్రజలు అనేక కష్టాలు పడుతున్న గాని భారత్ లో పరిస్థితులు చాలా సజీవుగా ఉండటం ఇందుకు నిదర్శనం. స్వతంత్ర దేశంగా భారత్ ఏర్పడిన తర్వాత… అన్ని రంగాలలో టాప్ లెవెల్ లో దూసుకుపోతోంది. వ్యాపార పరంగా.. ప్రపంచంలో ఇండియాలో ఉన్న మార్కెట్ మరో దేశంలో లేదు.అదేవిధంగా భారత్ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశ కంపెనీలను ప్రోత్సహించే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. దీంతో చాలా భారత్ కంపెనీలు స్వదేశంలో ఇంకా విదేశాలలో విజయవంతంగా రాణిస్తున్నాయి. కాగా నేడు గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పోటీ ప్రపంచంలో టాప్ మోస్ట్ లెవెల్ లో ఉన్న కంపెనీల గురించి తెలుసుకుందాం.

 Most successful made in India brands to remember on this Republic Day
కెఫీ కాఫీ డే:

1993 విజీ సిద్ధార్థ స్థాపించిన ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కాఫీ కప్పులు ఎగుమతి చేస్తది. ఈ కంపెనీ మన భారతదేశంలో మాత్రమే కాదు ఆస్ట్రియా, ఈజిప్ట్, మలేషియా, నేపాల్ ఇంకా మరి కొన్ని దేశాలలో.. విస్తరించబడింది.

 Most successful made in India brands to remember on this Republic Day

ఆదిత్య బిర్లా గ్రూప్:

ఇండియాలోనే వ్యాపార దిగ్గజ కంపెనీగా ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థలకీ ఎంతో చరిత్ర ఉంది. అనేక రంగాలలో కీలకంగా ఈ సంస్థ రాణిస్తూ ఉంది. దుస్తుల రంగంలో 2001 వ సంవత్సరం నుండి.. అలెన్ సోలీ కంపెనీని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం దూసుకుపోతోంది. అలెన్ సోలి అనే కంపెనీ 1744లో విలియం హాలిన్ స్థాపించడం జరిగింది. అయితే ఇదే కంపెనీని మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ 1990లో కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో “ఆదిత్య బిర్లా గ్రూప్” ఈ కంపెనీని కొనుగోలు చేయడం జరిగింది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ దుస్తులు తీసుకొస్తూ ఉంటది. అన్ని వయసుల వారికి కొత్త తరహా ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తాది.

 Most successful made in India brands to remember on this Republic Day

టాటా మోటార్స్:

టాటా మోటార్స్ వ్యవస్థాపకుడు రతన్ టాటా పేరు తెలియని వారెవరు ఉండరు. ఎంతో నిస్వార్ధమైన వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటా దేశంలో అనేక మంచి పనులు చేపడుతూ ఉంటారు. కార్ మరియు బస్ ఇంకా.. ఆటో మొబైల్ విభాగంలో దేశంలోనే అగ్రగామి సంస్థగా.. ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతుంది. ఫోర్డ్, జాగ్వార్.. ల్యాండ్ రోవర్.. వంటి బ్రిటిష్ కంపెనీలను కూడా ఇండియాలో హ్యాండ్ ఓవర్ చేసుకొని.. ఆటోమొబైల్ డిజైన్ లో టాటా మోటార్స్ ప్రపంచంలోనే టాప్ కంపెనీగా చలామణి అవుతూ ఉంది.

 Most successful made in India brands to remember on this Republic Day

వుడ్ ల్యాండ్:

1992లో స్థాపించబడిన ఈ ఫుట్ వేర్ కంపెనీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ. ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో మూడు చిన్న షాపులు గా అవతరించింది. అనతి కాలంలోనే దేశంలో టాప్ మోస్ట్ పాపులర్ ఫుట్ వేర్ కంపెనీ గా నిలిచింది.

 Most successful made in India brands to remember on this Republic Day

SBI:

ఇండియాలో బ్యాంకింగ్ రంగంలో పేరుగాంచబడింది SBI బ్యాంక్. ఇదొక ఇండియన్ మల్టీ నేషనల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ మరియు ప్రైవేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. 1955 వ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను …SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)గా ఆర్.బి.ఐ మార్చడం జరిగింది. తర్వాత ఇందులో చాలా బ్యాంక్స్ విలీనం చేసుకుని.. బిగ్గెస్ట్ కార్పొరేషన్ రంగంలో ఈ బ్యాంకు దూసుకుపోతూ ఉంది. సుమారు 36 దేశాలలో 190కీ పైగా ఫారెన్ ఆఫీసస్ మరియు మన ఇండియాలోనే 15 వేలకు పైగా బ్రాంచీలు ఈ ఎస్బిఐ కంపెనీకి ఉన్నాయి. ఈ సంస్థలో దాదాపు రెండు లక్షల 50వేలకు మందికీ పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. భారతీయ బ్యాంకింగ్ రంగంలో చాలా కీలకంగా రాణిస్తూ ఉంది.

 Most successful made in India brands to remember on this Republic Day

అమూల్:

వర్గీస్ కురియన్ స్థాపించిన ఈ కంపెనీ ఇండియాలోనే పాల ఉత్పత్తులలో అగ్రగామి సంస్థగా చలామణి అవుతుంది. అతి తక్కువ కాలంలోనే అమూల్ కంపెనీ దేశంలోనే పేరుగాంచింది. దీంతో కంపెనీ వ్యవస్థాపకుడు వర్గీస్ కురియన్ నీ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడ్డారు. మనదేశంలో పాల ఉత్పత్తి అతి తక్కువ ఉన్న సమయంలో ఆపరేషన్ ఫ్లడ్ నీ వర్గీస్ కు ముందుండి నడిపించడం జరిగింది. భారత పాడి రైతులను మోసం చేసిన బ్రిటిష్ కంపెనీని ఎదిరించిన కురియన్… చాలా పౌరుషంగా అమూల్ కంపెనీ స్థాపించి.. విజయవంతం కావడం జరిగింది.


Share

Related posts

ప్రభుత్వ వైద్య కళాశాలలో 542 ఖాళీలు..

bharani jella

ఢీ షో ల కంటెస్టెంట్స్ కి మాస్టర్స్ కి మధ్య అఫైర్స్….? యాంకర్ సుమ కామెంట్స్ వైరల్

arun kanna

Rajinikanth: రజినీకాంత్ కే ఎందుకు ఇలా జరిగింది .. ఇద్దరు కూతుర్లకీ అదే పరిస్థితి — ‘ఆ ఒక్క రోజు’ రజినీకాంత్ తలరాత మారిపోయే సంఘటన ?

somaraju sharma