Subscribe for notification

Mobile Tower’s Missing: తమిళనాడులో ఏకంగా 600 మొబైల్ టవర్ లు మాయం..!!

Share

Mobile Tower’s Missing: దొంగతనాలు పలు రకాలుగా ఉంటాయి. కొంతమంది డబ్బులు దోచేస్తారు. మరికొంతమంది బంగారంతో దోచేస్తారు. ఇంకా సిటీ బస్సులలో పాకెట్ పర్స్ లేదా మొబైల్ దొంగతనం చేసిన వాళ్ళు చూశాం. కానీ తమిళనాడు రాష్ట్రంలో వెరైటీగా ఏకంగా 600 మొబైల్ టవర్స్ దోచేయటం సంచలనం రేపుతోంది. సరిగ్గా కోవిడ్ 19 పాండమిక్ 2020లో స్టార్ట్ అయిన నాటి నుండి మొబైల్ ఫోన్ టవర్స్ మిస్సింగ్ కేసులు నమోదు స్టార్ట్ కావడం జరిగాయట. GTL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించి ఆరు వందల మొబైల్ ఫోన్ టవర్లు మిస్ అయినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉండగా.. దాని బ్రాంచ్ చెన్నైలో పురసవాకంలో ఉంది.

GTL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా 26000 మొబైల్ ఫోన్ టవలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క తమిళనాడులోనే 6 వేలకు పైగా మొబైల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా సంక్షోభం సమయంలో టవర్ సైట్ కి కంపెనీ ఉద్యోగులు పర్యవేక్షించగా అక్కడ అవి కనబడకపోవడం జరిగాయి. ఇక ఇదే సమయంలో ఇటీవల ఇతర నెట్వర్క్ అవసరాల కోసం పనిచేయని మొబైల్ ఫోన్ టవర్ల స్థితిగతులను అన్వేషించడానికి GTL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధికారులు రంగంలోకి దిగినప్పుడు.. మొత్తం తతంగం బయటపడింది. దాదాపు 600 టవర్లు కనిపించకపోవటంతో వాటి జాడ తెలియకపోవడంతో అధికారులు షాక్ అయిపోయారు.

ఈ నేపథ్యంలో మిస్సయిన మొబైల్ ఫోన్ టవర్ జిల్లాకి సంబంధించి ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయటం స్టార్ట్ చేశారు. పోలీసులు ఈ మొబైల్ టవర్ మిస్సింగ్ కేసులను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ దొగతనాలు మొత్తం ఒక గ్యాంగ్ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఒక్కో మొబైల్ టవర్ ఏర్పాటుకు దాదాపు 25 నుండి 40 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. దీంతో కోట్లలో నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఇలాంటి దొంగతనాలు ముందు ముందు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కంపెనీ విజ్ఞప్తి చేసింది. కాగా సరిగ్గా ఇటువంటి ఘటన తమిళనాడులోనే మధురై జిల్లా కూడల్ పుదూర్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకోటం జరిగిందట.  రూ.28 లక్షలతో ఏర్పాటు చేసిన వొడాఫోన్ మొబైల్ టవర్ ఈ ఏడాది జనవరిలో కనిపించకుండా పోయింది. దీంతో ఈ కేసుని పోలీసులు చాల సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని గాలింపు చర్యలు స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఏదిఏమైనా తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా వందల సంఖ్యల్లో మొబైల్ టవర్ లు మాయం కావడం సంచలనంగా మారింది.


Share
sekhar

Recent Posts

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

27 mins ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

28 mins ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

40 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

1 hour ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

2 hours ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago