Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ National Bank For Agriculture And Rural Development.. ఆఫీసర్స్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 162
ఆఫీసర్స్ గ్రేడ్ ఏ, బీ – 2021:
1.అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్) : 148
2. మేనేజర్ గ్రేడ్ బి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్) : 7
3. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (రాజ్ భాష సర్వీసెస్) 5
4. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్) : 2
అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 17/7/2021
దరఖాస్తులకు చివరి తేదీ :7/8/2021