Nagarjuna:టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రయోగాలకు పెట్టింది పేరు.. ఇప్పటివరకు ఈయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు.. వెండితెరపై మెప్పించి నాగార్జున.. ఇప్పుడు డిజిటల్ వేదికలో అరంగేట్రం చేయనున్నారని టాలీవుడ్లో ప్రచారం జోరుగా సాగుతోంది..!! ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూపొందించనున్న యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో నాగార్జున ప్రధాన పాత్ర లో నటించనున్నారని తాజా సమాచారం..!! ఇందులో వాస్తవమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన ఈ కథకి నాగార్జున ఓకే చెప్పారని ఈ సినిమా కేవలం డ్యూటీ లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఎంట్రీ గురించి అధికారిగా ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఈ న్యూస్ కి సంబంధించి ఫిలింనగర్ లో గట్టిగానే చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ న్యూస్ వాస్తవమే అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ నెలలోనే రానుంది. అంతే కాకుండా ఇటీవల నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఓటీటి లో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. దీంతో నాగార్జున కూడా డిజిటల్ ప్లాట్ ఫారంలో కి అడుగుపెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రం తరువాత బంగార్రాజు సినిమాలో నటించనున్నారు నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి బంగార్రాజు సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.