తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే కార్యక్రమాలలో ఒకటి బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాల్టీ షో కి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో ఫస్ట్ హిందీలో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. అక్కడ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. దాదాపు 14 సీజన్ లో అక్కడ కంప్లీట్ కాక దక్షిణాదిలో చాలా లేటుగా స్టార్ట్ అయ్యి ప్రస్తుతం ఆరో సీజన్ కి ముస్తాబయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ హోస్ట్ నాగార్జున తెలియజేశారు.
కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోగో ఆవిష్కరణ చేయగా..తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్పెషల్ వీడియో నాగార్జున సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడం జరిగింది. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా..బిగ్ బాస్ తర్వాతే ఏదైనా..అని వీడియోలో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ సీజన్ సిక్స్… ఎంటర్టైన్మెంట్ కి అడ్డా ఫిక్స్ అంటూ నాగ్ వీడియో చివరిలో డైలాగ్ వేయటం జరిగింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ వచ్చే నెల ప్రసారం కానుంది.
దాదాపు 100 రోజులకు పైగా జరగబోయే ఈ రియాల్టీ షోలో గత ఐదు సీజన్ లకు భిన్నంగా ఫిజికల్ టాస్క్ మరి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. చాలావరకు ఈసారి సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలను.. అందరికీ తెలిసిన ముఖాలను.. ఇంటి సభ్యులుగా షో నిర్వాహకులు అవకాశం కల్పించినట్లు టాక్. ఈ క్రమంలో తాజా సీజన్ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.