బిగ్ బాస్ ఇంటి లో ఈ సీజన్ స్పెషల్ అట్రాక్షన్ గంగవ్వ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన మాటలతో, హావభావాలతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఎప్పటికప్పుడు గేమ్ ను గంగవ్వ రక్తి కట్టిస్తూనే ఉంది. అలాంటి గంగవ్వ ఇప్పుడు ఒక్కసారిగా అనారోగ్య కారణాలతో ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వను ఇంటి నుండి బయటకు పంపేందుకు బిగ్ బాస్ అనుమతించారు.
రెండవ వారంలోనే అవ్వ ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించింది కానీ వెంటనే సరిపడా వైద్యం అందించడంతో ఆమె తిరి గికోలుకున్నారు. మునుపటికంటే చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి గంగవ్వకు ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. ఇంటిలోవైద్యులు పరీక్షాలు చేయగా… రిపోర్టులను పరిశీలించిన నాగార్జున ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆమెను ఇంటినుండే బయటకు పంపే బాధ్యతను బిగ్‌బాస్‌పై పెట్టారు. దాంతో గంగవ్వ ను ఇంటి నుండి బయటకు పంపించేందుకు అనుమతించడంతో ఆమె తిరిగి తన సొంత ఊరి కివెళ్ళవలసివచ్చింది.
ఇది గంగవ్వ బయటకు వెళ్లే సమయంలో తన ప్రయాణాన్ని ఇంటి సభ్యులు అంతా నాగార్జునతో కలిసి చూశారు. ఇక ఆ భావోద్వేగాలను ఆపుకోలేక అఖిల్, రాజశేఖర్ సుజాత విపరీతంగా ఏడ్చేశారు. వెళ్తూ వెళ్తూ గంగవ్వ అఖిల్ ను సేవ్ చేసి వెళ్ళిపోయింది. సోహెల్ సేఫ్ కావడంతో మిగిలిన సభ్యుల్లో గంగవ్వ చేతులమీదుగా ఒక కార్డు తీయించగా అఖిల్ ఫోటో వచ్చింది. ఇక వేదికపై నాగార్జున అందరికీ ఊరట కలిగించే విషయం చెప్పాడు.
గంగవ్వ కోరిక మేరకు తనకు ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. దాంతో ఇంటి సభ్యులు అంతా హర్షం ప్రకటించారు. నాగార్జున హామీతో గంగవ్వ కూడా హ్యాపీగా ఫీల్ అయింది.