బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లు ఈ విషయంలో యాంకర్ నాగార్జున ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం చూస్తే లీక్ వీరులు హౌస్ లో వీకెండ్ లో ఏం జరిగిందో ముందే సోషల్ మీడియాలో పెట్టేయడం. ఒక్క రోజు తేడాతో మాత్రమే గేమ్ రన్ అవుతున్న తరుణంలో ఎలిమినేషన్ సహా అన్ని ఆడియెన్స్ కి ముందుగానే తెలిసి పోతున్నాయి.
ముఖ్యంగా మూడవ వారం గేమ్ లో మొదట మెహబూబ్ ఇంటి నుండి బయటకు వస్తారని భావించిన తరుణంలో దేవి నాగవల్లి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు శనివారమే లీక్ చేసేసారు. అంతేకాకుండా హౌస్ లో ఏం జరగబోతుందో, ముందే సోషల్ మీడియాలో వచ్చేయడంతో యాంకర్ నాగార్జున ఫుల్ అసహనంగా ఉన్నట్లు.. ఇలా అయితే నా వల్ల కాదు అని షో నిర్వాహకులతో సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఇలాంటి షో నడిపించటం అని సీరియస్ అయినట్లు కూడా టాక్. సాయికుమార్ కెప్టెన్ అవటంతో పాటు ఇటీవల సోహెల్ కెప్టెన్ అవ్వటం వంటి విషయాలు ముందే లీక్ అవ్వడం వల్ల షో పై అంతగా జనాలలో ఇంట్రెస్ట్ పోయిందన్న టాక్ బయటకు వస్తుంది. బిగ్ బాస్ సీజన్ వన్ మినహా తర్వాత జరిగిన సీజన్లలో లీకుల బెడద తప్పటం లేదు. ఏది ఏమైనా హౌస్ లో ముందే విషయాలు ప్రేక్షకులకు తెలిసిపోవడంతో చివరిలో తన యాంకరింగ్ చేయడం వల్ల షో పై ఆడియన్స్ కు ఇంట్రెస్టు ఉండదని షో నిర్వాహకులతో ఇలా అయితే నా వల్ల కాదు అని నాగార్జున అన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినపడుతోంది.