NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : నిర్వాకులపై సీరియస్ అయిన నాగార్జున..? దొంగని కనిపెట్టలేని నిర్లక్ష్యానికి ఆగ్రహం

Share

దేశంలో మరే ఇతర రియాలిటీ షోకి సాధ్యం కాని రీతిలో రికార్డులను నెలకొల్పుతూ విజయవంతంగా 3 సీజన్లు పూర్తిచేసుకున్న తెలుగు బిగ్ బాస్ నాలుగవ సీజన్ బాగా జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ చూడని ప్రయోగాలతో ప్రారంభమైన ఈ షో మొదటి నుండి విపరీతమైన ఆదరణను ప్రేక్షకుల వద్దనుండి రాబట్టింది. 

 

ఇక ఇలాంటి సమయంలో బిగ్బాస్ ఇంటిలో ఒక దొంగ కలకలం రేపుతున్నాడు. ఈ విషయమై నాగార్జున నిర్వాహకుల నిర్లక్ష్యం పై భారీగా సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందని పూర్తి వివరాల్లోకి వెళితే ….ఇప్పటి వరకు దేశంలో ఏ భాషలో బిగ్ బాస్ షో కి దక్కని ఆదరణ తెలుగు లో లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ని ప్రజలు ఈ షో ని విపరీతంగా ఆదరిస్తున్నారు. నాగార్జున కూడా నిన్నటి ఎపిసోడ్ లో అతి భారీ స్థాయిలో ఓటు నమోదు అవుతోందని చెబుతున్నారు. 

ఇక ఇలాంటి షో లో నిర్వాహకులు సరికొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు. మంచి టాస్క్ లు ఇవ్వడం ద్వారా మొదట్లోనే ముగ్గురు ని వైల్డ్ కార్డు కింద ఇంటి లోనికి పంపించడం వంటి వాటితో షోను గట్టిగా నిలబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నాలు అన్నింటినీ నిర్వీర్యం చేసేలా ఇంటిలోనే ఒక దొంగ తిరుగుతున్నారని అనుమానం అందరికీ మొదలైంది. 

ఇక సరికొత్త టాస్క్లు, అప్పుడప్పుడు నాగార్జున తో తిట్లతో రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతుంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయానికి వచ్చేసరికి భారీగా లీకులు అవుతున్నాయి. యూనిట్ నుండి ఈ లీకులు వెళ్తున్నాయా లేదా నిర్వాహకుల నుండి వెలుగుతున్నాయో తెలియదు కానీ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఎంతో సీక్రెట్ గా వ్యవహరిస్తున్నప్పటికీ ఎలిమినేషన్ సహా ఎన్నో విషయాలు బయటికి రావడం గమనార్హం. సుజాత ఎలిమినేషన్, గంగవ్వ అనారోగ్యం వీటన్నింటిని సస్పెన్స్ గా ఉంచడం నిర్వాహకులు వల్ల కావట్లేదు. కాబట్టి నాగార్జున సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం ఏమాత్రం తగ్గదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం.


Share

Related posts

కార్తీక దీపం వంటలక్క కు అరుదైన రికార్డు…! దేశవ్యాప్తంగా ఎలా ఫేమస్ అయిందో చూడండి..!

arun kanna

మీరు రచయితలు అవ్వలా…

Teja

Bigg Boss 6 Telugu: కొణిదెల నీహారిక క్లోజ్ ఫ్రెండ్ ని ఎలాగైనా బిగ్ బస్ 6 లోకి తీసుకురావాలి అని చూస్తోన్న ప్రొడ్యూసర్లు .. ఆమె అంతా తోపా ?

sekhar