Nandamuri Family: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లలో అనిల్ రావిపూడి ఒకరు.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తీసి భారీ హిట్ కొట్టేశారు.. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్3 సినిమా ను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మరో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది.. ఇంతకీ ఆ మల్టీస్టారర్ మూవీ ఎవరితో తీస్తున్నారు.. ఏ స్టార్ హీరోలతో కలిసి చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
గత సంవత్సరం నుండి అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బాలయ్య మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ఒక కథ రెడీ చేసినట్లు సమచారం.. ఇటీవలే అనీల్ బాలయ్య కు కథ చెప్పారని.. బాలయ్య కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అయితే ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేయమని సూచించారని టాక్..
అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించే అవకాశం ఉండగా.. కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకు ముందు అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమా తీసి హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇందులో ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికీ.. నందమూరి అభిమానుల్లో బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్లో సినిమా అనేసరికి ఉత్సాహాన్ని నింపుతోంది.. ఇదే వార్త వాస్తవమైతే నందమూరి అభిమానులకు పండగే..