Narappa: విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా నటించిన చిత్రం నారప్ప.. రెండు తెలుగు రాష్ట్రాలలో నారప్ప సినిమా గురించి చర్చ జరుగుతోంది.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటన హైలెట్ గా నిలిచింది. తన కళ్ళ ముందే తను అన్నను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో సీనప్ప ఒదిగిపోయాడు.. ఇంతకీ సీనప్ప కి ఈ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ ఎలా దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా సినిమాలలో నటించాను.. ఎడిటింగ్ లో తీసేసారు..!!
సీనప్ప అసలు పేరు గీతాకృష్ణ ముందుగా రాఖీ అని పిలుస్తారు.. ఇటీవలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు.. నారప్ప సినిమా కంటే ముందే 2 షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ తరువాత సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేశారు.. ఏబిసిడి, ఇంకొన్ని సినిమాలలో నటిస్తే ఎడిటింగ్ లో తన పాత్రను తీసేశారని చెప్పాడు.. రంగస్థలం సినిమా లో పోస్టర్లు అంటించే పాత్రలో కనిపించింది తనేనని వివరించాడు. సినిమాలో అవకాశం పొందడం కోసం చాలా కష్టపడ్డానని అన్నారు. స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఉదయం స్కూలుకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి హైదరాబాద్ ఆడిషన్స్ కి తన అన్నయ్య తను కలిసి వెళ్లి వారిన వెళ్ళిన ప్రతి సారి మేమే మీకు ఫోన్ చేస్తానని చెప్పేవారట అలా చాలాకాలం ప్రయత్నించి పదో తరగతి ఎగ్జామ్స్ రావడంతో ఆ ప్రయత్నాలు చేయడం ఆపేశారు. అనుకోకుండా ఒక రోజు నారప్ప సినిమాలో ఒక పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తన అన్నయ్య కి ఫోన్ చేస్తే అనుకోకుండా ఆడిషన్ కి వెళ్లానని.. అప్పటికే ఇద్దరిని ఫైనలైజ్ చేసినా కూడా డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. నారప్పా సినిమాలో అవకాశం రావడానికి కారణం మాత్రం తన అన్నయ్యని తెలిపారు..
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, కో-డైరెక్టర్ కూడా ఈ పాత్రలో నటించడానికి తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిపాడు. వెంకటేష్ నటన చూసి కొన్ని సన్నివేశాలలో చాలా ఎమోషన్ అయ్యానట్లు చెప్పుకొచ్చాడు.. ఈ సినిమాలో లో ఎలా అయితే రఫ్ గా ఉంటాడో.. రియల్ లైఫ్ లో కూడా గానే రఫ్ గానే ఉంటా అని తెలిపాడు గీతాకృష్ణ.. వెంకటేష్ తో ఫోటో దిగాలని అందరూ అనుకుంటారు. అలాంటిది వెంకటేష్ తో పాటు నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు రాఖి..