Natasha Poonawalla: అమెరికాలో ఇటీవల న్యూయార్క్ లో మెట్రోపాలిటన్ మ్యూజియం అఫ్ ఆర్ట్ లో మెట్ గాలా 2022 ఫ్యాషన్ షో జరిగింది. ఈ షోలో నటాషా పూనావాలా ఇండియన్ సారీలో అందరి చూపును ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు చీర ధరించిన..నటాషా పూనావాలా ఫ్యాషన్ షోలో అందరి చూపులు కట్టిపడేసింది. ఈ క్రమంలో ..మెట్ గాలాలో నటాషా పాల్గొన్న ఫోటోలను డిజైనర్ సబ్యసాచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. కామెంట్ రూపంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. మెట్ గాలా లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో చీర కట్టు చూడాలని నా చిరకాల కోరిక. ఈ కోరిక ఇన్నాళ్లకు తీరింది. నటాషా పూనావాలా ధరించిన చీర గురుంచి చెబుతూ.. ఆ చీర విలువైన రాళ్ళు మరియు స్ఫటికలతో పాటు… భారతీయ హస్త కళలను ప్రతిబింబించే ఎంబ్రాయిడరీ పనితనం కలిగినది అని తెలిపాడు.అంతమాత్రమే కాదు దేశ సాంప్రదాయ పద్ధతులను ప్రతిబింబించేలా .. చీరతోపాటు..నటాషా పూనావాలా.. ధరించిన ఆభరణాలు..కూడా రూపొందించబడ్డాయి అని డిజైనర్ సభ్యసాచి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫోటోలు షేర్ చేయటం సోషల్ మీడియాలో నెటిజన్ లు నటాషా పూనావాలా ఫోటోలకి దివి నుంచి భూమి మీదకి దిగివచ్చిన దేవకన్యలాగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నటాషా ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో… రకరకాల ఫ్యాషన్ దుస్తులతో.. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక నటాషా పూనావాలా నేపథ్యం చూస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా భార్య మాత్రమే కాదు ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనాని ఇండియా ఎదుర్కోవడంలో సీరం ఇన్స్టిట్యూట్ దే ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. నిర్ధారణ పరీక్షలు చేయటంలో మరియు కరోనా విరుగుడు వ్యాక్సిన్..లు తక్కువ టైంలో అందించటంలో ఇండియాలో సీరం కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన మన దేశంలో వ్యాక్సిన్ పేదవాళ్లు మొదలుకొని ధనికుల వరకు చేరటంలో సీరం ఇన్స్టిట్యూట్ చాలా తెలివిగా పగడ్బందీగా వ్యవహరించింది. అత్యంత ప్రమాదకరమైన వైరస్ నుండి అనేక మంది ప్రాణాలను నిలబెట్టింది. అటువంటి ఈ కంపెనీకి చెందిన సీఈఓ భార్య నటాషా పూనావాలా.. న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ షోలో భారతీయ చీరకట్టులో… అదరహో అనిపించడంతో ఆమె పేరు ఇంటర్నెట్ లో భారీగా మారుమ్రోగుతోంది. భారతీయ చీరకట్టు వైభవాన్ని.. సంస్కృతిని ప్రతిబింబించేలా.. బంగారు చీరకట్టులో.. రెడ్ కార్పెట్ పై నడుస్తు.. అందరి చేత చప్పట్లు .. కొట్టించింది. దీంతో నటాషా ఫ్యాషన్ షోకి.. సంబంధించి పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. చీరకట్టులో నటాషా పూనావాలా అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.