Nani: అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నాని.. పాత్రలో సహజంగా నటించి మెప్పించడం నాని కి పెట్టింది పేరు.. అందుకే ఆయనని నాచురల్ స్టార్ నాని గా పిలుచుకుంటారు.. సోషల్ మీడియా లో నాని యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని అరుదైన మైలురాయిని చేరుకున్నారు..
నాని 2012లో ట్విట్టర్లో ఖాతాను తెరిచారు.. నాని నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్ అయినవే.. ఒకటో రెండో ఫ్లాప్ తప్ప.. నాచురల్ స్టార్ నాని సినిమా విడుదల అంటే హిట్ పక్క అంటున్నారు ప్రేక్షకులు. హీరోగానే కాకుండా అ! సినిమాతో దర్శకుడిగా మారాడు. అటు బుల్లితెరపై బిగ్ బాస్ 2 ఫస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.. నాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం నాని నటించిన టక్ జగదీష్ సినిమా అన్ని పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు థియేటర్ లోనే విడుదల అవుతాయని క్లారిటీ ఇచ్చారు.