Richie Gadi Pelli: కమెడియన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నవీన్ నేని.. ఒక చిన్న విరామం సినిమాలో హీరో గా నటించి మెప్పించాడు.. ఈరోజు నవీన్ నేని పుట్టినరోజు.. ఈ సందర్భంగా “రిచి గాడి పెళ్లి” టైటిల్ ను ఐశ్వర్య రాజేష్ ప్రకటించారు.. నవీన్ నేని కి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్..!!
ఇప్పటి వరకు అనేక సినిమాల్లో కమెడియన్ గా మెప్పించాడు నవీన్. అలాగే జబర్దస్త్ లో కూడా పలు స్కిట్స్ లో నటించాడు. నవీన్ నేని హీరోగా నటిస్తున్న రిచి గాడి పెళ్లి పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తర్వాత మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నవీన్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె ఎస్ హేమరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా విజయ్, ఎడిటర్ గా అరుణ్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చందన రాజ్, పట్నాయక్ ప్రణీత హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాకు సత్యన్ సంగీతం సమకూరుస్తున్నారు.