ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: నెగిటివ్ క్యాలరీస్ తో బరువు తగ్గండిలా..!!

Share

Weight Loss: నెగిటివ్ ఎనర్జీ లా నెగిటివ్ క్యాలరీస్ ఏంటి అనుకుంటున్నారా..!? నెగిటివ్ క్యాలరీస్ ఫుడ్ అంటే మనం తీసుకున్న ఆహారం కంటే అది జీర్ణం అవ్వడానికి అవసరమయ్యే క్యాలరీలే ఎక్కువ..!! మన రెగ్యులర్ డైట్ లో నెగెటివ్ క్యాలరీ ఫుడ్ ఉంటే బరువు తగ్గొచ్చు అంటున్నారు న్యూట్రిషన్లు..!! ఇంతకీ నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్ ఏంటి..!? ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

నెగిటివ్ క్యాలరీ ఫుడ్స్ లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ ఫుడ్ లో మొదటిది దోసకాయ. 100 గ్రాముల దోసకాయ లో 15 క్యాలరీలు ఉంటాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందించటం తోపాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. ఇందులో డైటరి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, పేగు సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇక రెండవది టమోటా. ఈ రోజుల్లో టమోటా లేని కూర ఉండదు. అంటే అతిశయోక్తి కాదు. ఒక వంద గ్రాముల టమాటోలు 19 క్యాలరీలు ఉంటాయి. ఇందులో విటమిన్ సితో పాటు పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది .ఇది చర్మ సంబంధిత సమస్యల నుంచి క్యాన్సర్ వరకు మనల్ని రక్షిస్తుంది.

Negative Calorie Food to reduce Weight Loss:
Negative Calorie Food to reduce Weight Loss:

నెగిటివ్ ఫుడ్ లో కూరగాయలు మాత్రమే కాదు పండ్లు కూడా ఉన్నాయి వాటిలో మొదటిది పుచ్చకాయ. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పుచ్చకాయలు 30 కేలరీలు ఉంటాయి. పుచ్చ లో విటమిన్ బి6, సి ఉంటాయి. ఈ కాయ తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. రక్తహీనతను నివారిస్తాయి. స్ట్రాబెర్రీ , బ్లూబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. అరకప్పు బెర్రీస్ లో కేవలం 32 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు చెప్పిన నాలుగు పదార్థాలు తీసుకోవటం వల్ల సులువుగా బరువు తగ్గచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


Share

Related posts

పాపకి పవన్ కళ్యాణ్ కావాలట ..ఈ ప్లాన్ ఎవరిది ..?

GRK

బ్రేకింగ్: అచ్యుతాపురం బ్రాండిక్స్ లో మళ్లీ గ్యాస్ లీక్..50 మంది మహిళా కార్మికులకు అస్వస్థత

somaraju sharma

నేడు టీటీడీ బోర్డు సమావేశం: 93 అంశాల భారీ ఎజండాపై చర్చ

somaraju sharma