NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

మోడీ తర్వాత జగన్ : సరికొత్త రికార్డ్ నమోదు చేసిన ఆంధ్ర సీఎం

 

 

జగన్ తన పేరు మీద సరికొత్త రికార్డు ఆవిష్కరించారు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దాదాపు మోడీ దగ్గర వరకు వెళ్లిన స్వల్ప తేడాతో రెండో ప్లేసులో ఉండిపోయారు. లేకుంటే మోడీను సైతం పక్కకు నెట్టి నెంబర్ 1 గా నిలిచేవారు…. అవునవునూ… దేనిలో మోడీతో పోటీ పడ్డారని టెన్షన్ పడుతున్నారా..?
అయితే ఇది చదివేయండి

సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేయడం ఎప్పుడూ ఫ్యాషన్. ఆయా సందర్భాలను బట్టి యాష్ టాగ్ ద్వారా ఒక సమూహం మొత్తం దాన్ని టాగ్ చేయటమో, లేక అదే యాష్ టాగ్ ట్రేండింగ్ మీద సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడమో సర్వసాధారణం. ఆ ట్రేండింగ్ సోషల్ మీడియాలో అందరిని చేరితే, దాన్ని అందరు ఆదరిస్తే అది అప్పటి ట్రెండింగ్లో మొదటి స్థానాన్ని పొందుతుంది. సోషల్ మీడియా ట్రెండింగ్ లో మోడీ మొదటిస్థానం లో 2 , 171 ట్రెండింగ్లో మొదటి స్థానాన్ని దేశవ్యాప్తంగా సాధిస్తే, తర్వాత స్థానాన్ని ఆంధ్ర సీఎం వైఎస్ జగన్ సాధించారు. ఆయన పేరు మీద 2 , 137 ట్రెండ్స్ నమోదు అయ్యాయి. తర్వాత స్థానాల్లో రాహుల్, మమతా బెనర్జీలు ఉన్నారు. కేవలం ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు ఇండియాలో నమోదు అయినా ట్రెండింగ్స్ మాత్రమే పరిగణనలోకి తీస్కొని ర్యాంకులు ఇచ్చారు. మోడీకి జగన్కు మధ్య 34 ట్రెండింగ్స్ మాత్రమే తేడా కనిపించింది. సోషల్ మీడియాను నిశితంగా గమనించే చెక్ బ్రాండ్ సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. యాష్ టాగ్ లు నమోదు, దాన్ని ఫాలో అవ్వడంలోనూ జగన్ అభిమానులు, వైస్సార్సీపీ కార్యకర్తలు ముందు ఉన్నట్లు తేలింది.

బీజేపీ గుస్సా

సోషల్ మీడియా విభాగానికి బీజేపీ దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ నడుపుతోంది. దాదాపు 4 వేలమందికి పైగా నిస్సాణతులతో బీజేపీ కు అతి పెద్ద టీమ్ నిరంతరాయంగా పని చేస్తుంది. దేశవ్యాప్త సోషల్ మీడియా విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటిని బీజేపీ కు అనుకూలంగా తీర్చిదిద్దటం లో పెద్ద కోర్ టీమ్ పని చేస్తోంది. దీనికి ఏటా వేలకోట్లను బీజేపీ వెచ్చిస్తోంది. ఇటీవల ఫేస్ బుక్ లో పని చేస్తున్న ఒక కీలక అధికారిని సైతం బీజేపీకు అనుకూలంగా ఉన్నారని రాజీనామా సైతం చేసేంత.. పెద్ద నెట్ వర్క్ ను బీజేపీ సమాంతరంగా నడిపిస్తోంది. అయితే ఒక రాష్ట్రానికి చెందిన సీఎం తాలూకా సోషల్ మీడియా టీమ్ ఎంత బలంగా ట్రెండింగ్లను సృష్టిచగలుగుతుందో ఇప్పుడు బీజేపీ సాంకేతిక విభాగ సెల్ కు కునుకు లేకుండా చేస్తోంది. వైస్సార్సీపీ సోషల్ మీడియా టీమ్ మీద బీజేపీ పెద్దలు ఒక కన్నేసి ఉంచాలని, ఆంధ్ర జరిగి కార్యక్రమాలను, దానికి అనుగుణమైన ట్రెండ్స్ ను సైతం ఫాలో అయ్యేలా ఏర్పాట్లు చేయాలనీ బీజేపీ టీమ్ పోటీకి రెడీ అంటోంది. ఒకవేళ బీజేపీ టీమ్ రాష్ట్రము మీద ప్రధాన ద్రుష్టి పెడితే దాన్ని వైస్సార్సీపీ సాంకేతిక విభాగం ఎలా ఎదుర్కొంటుంది..? వచ్చే కాలంలో సోషల్ మీడియా వార్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరమే.

author avatar
Special Bureau

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju