మొదలైన నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిపోయింది. ఈమె నిశ్చితార్థం మొదలుకొని తన కాబోయే భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకున్నారు. అయితే కేవలం ఆరు రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా డాటర్ నిహారిక పెళ్లి సందడి మొదలైందని చెప్పవచ్చు. పెళ్లి దగ్గరపడుతుండడంతో మెగా ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబం అంతా ఒకచోట కలిసి సందడి చేస్తున్నారు.

నిహారిక పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో ఈమె వివాహాన్ని రాజస్థాన్ లో ఉదయపూర్ కోటలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉదయపూర్ లోని కోట అందుకు ముస్తాబవుతోంది. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల15 నిమిషాలకు నిహారిక పెళ్లి జరగనుంది. ఈ వివాహానికి మెగా కుటుంబ సభ్యులందరూ రాజస్థాన్ వెళ్లనున్నారు. అయితే డిసెంబర్ 11న హైదరాబాద్ లో జె. ఆర్. సి కన్వెన్షన్ హాల్లో వివాహ రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు.

నిహారిక పెళ్లికి కేవలం ఆరు రోజులు ఉండటంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట కలిసి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక పెళ్లి చేసుకోబోయే అతను గుంటూరు ఐ జి కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ జంట డిసెంబర్ 9న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.