దీపాలు వెలిగించిన హీరో నిఖిల్.. ఎందుకో తెలుసా..?

కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా దేవాల‌యాలు దీపాల‌తో నిండిపోతాయి. ఆల‌యాల్లో ఎక్క‌డ చూసినా దైవ‌ నామ స్మ‌ర‌ణ మారుమ్రోగుతుంది. అయితే ఈ స‌మ‌యంలో సాధార‌ణ జ‌నం మాత్ర‌మే కాకుండా.. ప‌లువురు ప్ర‌ముఖులు కూడా దేవాల‌యాల‌కు వ‌స్తుంటారు. అందులో సినీ ప్ర‌ముఖులు కూడా ఉంటాయి. అయితే ఈ కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ప‌లు ఆలయాల్లో హీరోయిన్లు సైతం త‌మ మొక్కుల‌ను తీర్చుకోవ‌డానికి ఆల‌యాల‌కు పోతుంటారు.

ఆల‌యాల‌కు పోయిన వెంటనే దేవుళ్ల‌ను పూజించుకుని దీపాల‌ను వెలిగిస్తుంటారు. అయితే దీపాలు వెలిగించేవారిలో మాక్సిమం హీరోయిన్లు మాత్ర‌మే ఉంటారు. కానీ ఇప్పుడో యంగ్ హీరో కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా దీపారాధ‌న చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆయ‌నే హీరో నిఖిల్. ఈ యువ హీరో సికింద్రాబాద్ స్కందగిరిలోని కార్తికేయ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించాడు. కార్తీక పౌర్ణమి సందర్బంగా 365 దీపాలను వెలిగించి త‌న భ‌క్తిని చాటాడు.

హీరో నిఖిల్ త‌న కుటుంబ సభ్యులతో క‌లిసి ఆల‌యానికి వ‌చ్చాడు. కుటుంబ స‌భ్యులతో పాటు ఆల‌యంలో దీపాలను వెలిగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతి సంవ‌త్స‌రం దేవాల‌యానికి వ‌చ్చి దీపాల‌ను వెలిగిస్తాన‌ని తెలిపాడు. కార్తీక పౌర్ణ‌మిలో ఏదో ఒక రోజు కార్తికేయ స్వామికి దీపాలను వెలిగిస్తాన‌ని తెలిపాడు. ఇది ఆనవాయితీగా వస్తుందని హీరో నిఖిల్ తెలిపాడు. అయితే భారీగా జనాలు ఉన్నా కూడా హీరో నిఖిల్ ఆల‌యంలో దీపాలను వెలిగించాడు.

నిఖిల్ ప్ర‌స్తుతం మూడు సినిమాలో న‌టిస్తున్నాడు. వాటిల్లో ప్రధానంగా అందరి దృష్టి కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న సినిమాపైనే ఉంది. ఈ సినిమా గ‌తంలో మంచి స‌క్సెస్ అయ్యింది. కాబ‌ట్టి దాని సీక్వెల్ పై ఇప్పుడు అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ప్రేక్ష‌కుల అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ని ఈ సినిమా డైరెక్ట‌ర్ ప‌లు మార్లు చెప్పాడు. అయితే ఈ కార్తికేయ సీక్వెల్ వచ్చే ఏడాది వేస‌వి తర్వాత విడుదల అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

అలాగే హీరో నిఖిల్ మ‌రో రెండు మూడు సినిమాలు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇవి చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఇవి షూటింగ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు తెలుపుతున్నారు.