NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Nirmala Sitaraman: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన కేంద్రం

Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభ వార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రిడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఐసీజీఐ బిల్లు 2021ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై అయిదు లక్షల వరకూ భీమా పొందవచ్చు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం విధించినా కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ భీమా వర్తిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Nirmala Sitaraman: Dicgi 2021 bill cabinet approved
Nirmala Sitaraman Dicgi 2021 bill cabinet approved

భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆమె తెలిపారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులకు ఊరట కలుగుతుందని సీతారామన్ చెప్పారు. సాధారణంగా భీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2020 లో ఈ భీమా మొత్తాన్ని లక్ష నుండి 5 లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీఐ నుండి భీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కు తీసుకునేందుకు   వేచి ఉండాల్సిన అవసరం లేదు.

author avatar
bharani jella

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju