Maestro: నితిన్ తన కెరీర్లో 30 వ చిత్రంగా రూపొందుతున్న సినిమా మాస్ట్రో.. ఇటీవల నితిన్ పుట్టినరోజు సందర్భంగా మాస్ట్రో ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.. హైదరాబాదులో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. తాజాగా మాస్ట్రో సినిమా చిత్రీకరణ పూర్తి అయినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు..!!
ఈ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ నటిస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా ఈ సినిమా లో కీలక పాత్ర లో అలరించనుంది.. ఈ ఫైనల్ షెడ్యూల్ లో నితిన్ తమన్నా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.. ఈ సినిమా లో ఇవే హైలెట్ సీన్స్.. మాస్ట్రో సినిమా మా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో ఎం సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన మాస్ట్రో ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది..