ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవబోతున్న బిగ్ సెలబ్రిటీ..??

Share

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ రియాల్టీ షో ప్రస్తుతం ఓటిటి లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ఈ షోలో 17 మంది కంటెస్టెంట్ లో ఎంట్రీ ఇవ్వగా.. తొమ్మిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ఎనిమిది మంది హౌస్ లో ఉన్నారు. ఫిబ్రవరి నెలాఖరున ఈ షో ప్రారంభం కాగా… ఫైనల్ కి చేరుకున్న నేపథ్యంలో..హౌస్ లో వాతావరణం రసవత్తరంగా మారింది. స్టార్టింగ్ లో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పెద్ద గా పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇప్పుడు.. కొత్తగా వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు.

Now this week hamida eliminate in oot bigg boss

కీలక టైంలో తమదైన శైలిలో హౌస్ లో రాణిస్తున్నారు. ఈ తరహాలోనే హౌస్ లో కంటెస్టెంట్ ల మద్దతుదారులు బయట భారీ ఎత్తున ఓటు వేసే పనిలో ఉన్నారు. గేమ్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో.. హౌస్ లో కీలకంగా రాణిస్తున్న బిగ్ సెలబ్రిటీ హమీదా ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ కి సెలక్ట్ కావడం తో హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు ఓటింగ్ పరంగా చివరిలో ఉన్నట్లు అనధికార పోల్ లెక్కలు బయట పడుతున్నాయి.

Now this week hamida eliminate in oot bigg boss

ఈవారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు బాబా భాస్కర్, మిత్రశర్మ, శివ, నటరాజ్ మాస్టర్, హమీద, అరియనా, అనిల్ రాథోడ్. అయితే వీరందరిలో హమీద కి తక్కువ ఓటింగ్ పడినట్లు ఆమె ఈ వారం ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హామీద పెద్దగా రాణించలేదు. శ్రీ రామచంద్ర తో క్లోజ్ అయి వార్తల్లో నిలిచింది. కానీ ఓటిటి బిగ్ బాస్ షోలో… సీజన్ ఫైవ్ కంటే చాలా బాగా ఆడటం జరిగింది. ఈ తరుణంలో హమీద గ్యారెంటీ టాప్ పైకి వెళ్తారని భావించిన సమయంలో హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్త రావడం ఆమె మద్దతుదారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది.


Share

Related posts

Roja: రోజా సంచ‌ల‌న కామెంట్లు… తెలంగాణ గురించి కీల‌క వ్యాఖ్య‌లు

sridhar

Shatagni Trailer: శతఘ్ని సినిమా ట్రైలర్ రిలీజ్..!!

bharani jella

KGF: ఇండస్ట్రీ ఆశ్చర్యపడేలా కరోనా కష్టకాలంలో “కేజిఎఫ్” హీరో బిగ్ హెల్ప్..!!

sekhar