NPS Scheme: ప్రస్తుతం జీవితం సాఫీగానే సాగిపోతున్నా.. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేసుకోకపోతే మాత్రం రిటైర్మెంట్ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఆలోచించి చేసుకోవాలి.. అందుకోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉత్తమ ఎంపిక .. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేషనల్ పెన్షన్ స్కీం మీ రిటైర్మెంట్ తర్వాత ఉత్తమ ఎంపీకలలో ఒకటి. ఈ పథకంలో మీరు ప్రతి నెల కేవలం రూ. 4500 పెట్టుబడి పెడితే.. మీకు నెలకు రూ.51848 పెన్షన్ వస్తుంది. వాస్తవానికి నేషనల్ పెన్షన్ స్కీం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిలో చేరడానికి మీకు 21 సంవత్సరాలు ఉండాలి.. అప్పటినుంచి ప్రతి రోజు రూ. 150 అనగా.. నెలకు రూ. రూ. 4500 పెట్టుబడి పెట్టాలి. ఏడాదికి రూ. 51848 పెట్టుబడి పెడతారు. ఇలా 39 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే రూ. 21 లక్షలు అవుతుంది .
దీనిపై 10% రాబడితో మెచ్యూరిటీ రూ. 2.59 కోట్ల ఫండ్ క్రియేట్ అవుతుంది. ఇక నేషనల్ పెన్షన్ స్కీం పథకం కింద లబ్ధిదారులు. మొత్తంలో నుంచి 40% వాటాను పెన్షన్ గా పొందుతారు. అంటే రిటైర్ అయ్యాక నెలకు రూ. 51848 పెన్షన్ గా వస్తుంది. సెక్షన్ సిసిడి 80(1), సిసిడి 80 (బి), సిసిడి 80(2) కింద మీరు పండు రాయితీకుండా కూడా పొందవచ్చు. సుమారు ఎంపీసీసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు లక్షల మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎన్పీఎస్ ఖాతాను తెరవడానికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది.