‘ట్రంప్’కి భారీ షాక్ ఇస్తున్న భారతీయులు.. రాత్రికి రాత్రే కథ మార్చేశారు!

అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల జరుగుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారం చాల రసవత్తరంగా జరుగుతుంది. అయితే నిజానికి మన దేశంలో ఎన్నికలతో పోలిస్తే అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల తీరు మొత్తం చాలా వేరుగా ఉంటుంది. అక్కడ ఎన్నికల్లో జరిగే ఫండ్ రైజింగ్ కార్యక్రమమే ఎంతో కీలకం.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఇప్పటికే అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న డోనాల్డ్ ట్రాంప్ మరోసారి ఎన్నికల్లో నిల్చున్నాడు. ఇక డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ నిల్చున్నాడు. సర్వే ప్రకారం వెళ్తే.. జో బైడెన్ జోరు మీద ఉన్నాడని సమాచారం. జో బైడెన్ కోసం భారతీయ అమెరికన్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు.

కేవలం అంటే కేవలం ఒక్క రాత్రిలోనే దాదాపు రూ.24.34 కోట్లను విరాళంగా సేకరించి గతంలో రికార్డులను బద్దలు కొట్టారు. అయితే ఇంత మొత్తం డబ్బు విరాళంగా సేకరించడానికి కారణం భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అని.. ఆమె ఉపాధ్యక్ష పదవిలో ఉండటంతోనే ఇంత భారీగా నిధులు వచ్చినట్టు అక్కడ వారు భావిస్తున్నారు. ఇక సర్వేల ప్రకారం చూస్తే అమెరికా ప్రత్యేక్ష అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ వెనుకపడ్డాడు అనే చెప్పాలి.