NTR Jayanthi: వెండితెరపై అందాల రాముడైనా.. కొంటె కృష్ణుడైనా.. ఏడుకొండలవాడైనా.. ఇలా ఏ పాత్ర చేసిన ఆ పాత్రకు నిండుదనం తెస్తారు ఎన్టీఆర్..!! తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లో ప్రవేశించి.. కేవలం 9 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించారు అన్నగారు..!! నేడు నందమూరి తారక రామారావు 99వ జయంతి.. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి మీద ప్రేమను మరోసారి తన గాత్రంతో “శ్రీరామ దండకం” పాడి చాటుకున్నారు.. తాజాగా ఆయన పాడిన శ్రీ రామ దండకం వీడియోను విడుదల చేశారు ఎన్.బి.కె నిర్మాణ సంస్థ..

పవిత్ర శ్లోకమైనా శ్రీరామ దండకం ని బాలకృష్ణ ఆలపించారు.. గత సంవత్సరం వన్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ శివశంకరి అనే పాటని ఆలపించి ఫాన్స్ ని ఆకట్టుకున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరోసారి ఆయన గాత్రం తో పాట పాడి ఫ్యాన్స్ను ఫిదా చేశారు తన తండ్రిపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.. ఎన్ బి కే సంస్థ విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా తమ తాతను స్మరించుకున్నారు..
వాస్తవానికి నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ సినిమా ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో సందడి చేయనున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రికార్డుల ప్రభంజనం సృష్టించింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.