NTR – NBK: కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. “శ్రీరామ దండకం” కి టైం ఫిక్స్..!!

Share

NTR – NBK: నందమూరి నటసింహం బాలకృష్ణకు తన తండ్రి నందమూరి తారక రామారావు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రతి సందర్భంలోనూ తన తండ్రి మీద ప్రేమను ఆయన చాటి చెబుతూ ఉంటారు.. తన తండ్రి జయంతి సందర్భం గంగా మరోసారి ఆయన మీద ప్రేమను చాటుకున్నారు బాలయ్య. రేపు ఎన్టీఆర్ 99 వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తన తండ్రి కి నివాళులర్పిస్తూ పాడిన శ్రీరామ దండకం రేపు ఉదయం  9:45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు..

NTR - NBK: Sri Rama dandakam balakrishna sings released tomorrow
NTR – NBK: Sri Rama dandakam balakrishna sings released tomorrow

బాలకృష్ణ సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్ బీకే ఫిలిమ్స్ బ్యానర్ నుంచి ఈ వీడియోను విడుదల  చేయనున్నారు రేపటి వరకు ఎదురు చూడండి అంటూ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి ని నెలకొల్పారు. ఇటీవల భీష్మ ఏకాదశి రోజున తండ్రిని అనుకరిస్తూ వేసిన భీముడు గెటప్ విడుదల చేసి అభిమానులను అలరించారు. సినీ చరిత్రలో మొదటిసారిగా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కించి తన ప్రేమను తెలియజేశాడు. ఈసారి స్వయంగా తనే శ్రీరామ దండకం పాడి తన తండ్రిపై ప్రేమను మరోసారి చాటుకున్నాడు..

 

నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా అఖండ.. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో నంబర్ వన్ గా నిలిచి రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Share

Related posts

పవన్ ప్రచారానికి రానట్లేనా? : ఇది బీజేపీకి దెబ్బె కదా

Special Bureau

ఆ టీచర్ల విన్నూత ఆలోచన.. ఆ విధులే బడి అయ్యింది!

Teja

రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే అవి తినాల్సిందే.. ఏవి అంటే?

Teja