NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

జాజికాయలు పొడి తీసుకుంటే అలాంటి సమస్యలు ఉండవట!

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లుగా భావిస్తారు. ఈ సుగంధ ద్రవ్యాలను వంటలలో వాడడం వల్ల ఎంతో సువాసన, రుచితో కూడిన వంటలు తయారు అవుతాయి. అటువంటి సుగంధ ద్రవ్యాలలో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను ప్రతిరోజు మనం ఆహారపదార్థాలలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.జాజికాయను వాడటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

జాజికాయ ఎన్నో పోషక విలువలకు నిలయం. ఇందులో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. జాజికాయను ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది.

చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి జాజికాయ ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. రాత్రి పడుకునే సమయంలో ఒక జాజికాయ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. జాజికాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తగ్గిస్తుంది.

ఇందులో ఉన్న మిరిస్టిసిన్, ఎలిమిసిన్, సఫ్రోల్ వంటి రసాయనాలు ఈ నొప్పి చికిత్సకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన నోటి నుండి వచ్చే దుర్వాసనను పోగొట్టడమే కాకుండా మరింత తాజాగా ఉంచుతుంది. అలాగే నోటి పుండ్లను నివారించడంలో జాజికాయ కీలక పాత్ర పోషిస్తుంది.

జాజికాయ లో విరివిగా లభించే కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు అధిక రక్తపోటును నియంత్రించడమే కాకుండా,ఎముకలు బలంగా తయారవడానికి కాల్షియం ఎంతో తోడ్పడుతుంది. జాజి కాయ కాలేయ రుగ్మతలు, గాయాలు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంతటి పోషక విలువలు కలిగిన జాజికాయ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri