తెలుగు బుల్లితెర దిగ్గజ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ‘బొమ్మ అదిరింది’ షో లోకి ఎంట్రీ ఇచ్చిన సుమక్క అక్కడ దుమ్ము రేపింది అనే చెప్పాలి. సుమ హంగామా షో కి కొత్త ఎనర్జీ తెచ్చింది. దానికి తగ్గట్టు యాంకర్ శ్రీముఖి ఆమెతో పాటు వేసిన కౌంటర్లు, సెటైర్లు…. నాగబాబు తనదైన శైలి పంచులు వేయడం ఈ షో కి మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.
ముందు శ్రీముఖి ని చూసి నాగబాబు ఇక శ్రీముఖి వచ్చిన తర్వాత నా ముఖంలో నవ్వు ఎక్కడ ఉంటుంది అంటూ కామెంట్ చేశారు. దానికి శ్రీముఖి ఎప్పటిలాగానే అరిచేసింది. ఆమె గొంతు మనకి సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత యాంకర్ సుమ లేడీస్ హాస్టల్ ఓనర్ గా వచ్చి మొత్తం స్టేజీ నే అల్లాడించింది. లేత మనసులు ఉన్న నా చెల్లెలు అంటూ ఉంటే నీకు వారంతా చెల్లెళ్ళా? అని శ్రీముఖి మధ్య లో దూరింది.
దాంతో మండిపోయిన సుమ వెంటనే నాకు 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు ఒకేరోజు వచ్చాయి నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను అంటూ ఝలక్ ఇచ్చింది. ఇదే సమయంలో సుమ కొద్దిసేపటి తర్వాత గట్టిగా అరవడం చూసి శ్రీముఖి కౌంటర్ వేసింది. నీకు వయసు పెరిగినకొద్దీ బిపి కూడా పెరిగి పోతున్నట్లు కనిపిస్తోంది అని చెప్పగానే సుమ కూడా నేనేమీ తక్కువ తినలేదు అన్నట్లు “మరి నీకు..?” అని కౌంటర్ వేసింది. నాకు ఏం పెరిగింది…. అనేలా శ్రీముఖి ఏదో సమాధానం చెప్పబోయి ఒకసారి గా పరిస్థితి అర్ధమయిన నవ్వేసింది.
ఇలా ఇద్దరు వాగుడుకాయల మధ్య ఆ షో స్టేజీ ఊగిపోయింది. వీరి కామెంట్లు, సెటైర్లు, పంచ్ లకు ఎవరైనా చెవులు మూసుకోవాల్సిందే. ఇద్దరి గొంతులు అలాంటివి మరి. ఇలా ‘బొమ్మ అదిరింది’ షోలో కౌంటర్లు సెటైర్లతో ప్రోమో నిండిపోయింది.. ఎపిసోడ్ కూడా దద్దరిల్లింది అనే చెప్పాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!