LOL Salaam: ఓటీటీలు మొదలయినప్పటి నుంచి వెబ్ సిరీస్ కి కొదవేలేదు.. ఓటీటీ పుణ్య పుణ్యమా అని నూతన నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు పరిచయమవుతున్నారు.. విభిన్నమైన కథాంశంతో కొడుకుని నా కొత్త రకం ప్రయత్నాలను తెలుగు సినీ ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తూ ఉంటారు.. కంటెంట్ బాగుంటే అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఆదరణ లో ఎటువంటి తేడా ఉండదు.. తాజాగా విభిన్న కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా “లోల్ సలామ్” వెబ్ సిరీస్ జీ-5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు..

ఈ వెబ్ సిరీస్ విశేషాలను క్రియేటర్ అండ్ డైరెక్టర్ నాని తెలియజేశారు. కరోనాతో ఒత్తిడిలో ఉన్న అందరినీ పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడమే మా లక్ష్యం. దైనందిన జీవితం లో ఉన్న టెన్షన్ తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురులో అనుకోకుండా ఒకరు ఆ అడవిలో ఒక ల్యాండ్ మైన్ మీద కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లు అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు.. అనేది పూర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా రూపొందించాం.ఈ వెబ్ సిరీస్ ను 40 మంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించాం అని వివరించారు. ఈ సిరీస్ కి అజయ్ అరసాడ మ్యూజిక్ అందించారు. రాకేష్ నారాయణ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సిరీస్ తో వెంకటకృష్ణ ఎడిటర్ గా పరిచయం కానున్నారు. జూన్ 25న ఈ వెబ్ సిరీస్ జీ-5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.