Pan India Movie: ఇండియాలో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే..! విశేషాలు చూడండి..!!

Share

Pan India Movie: ఒక మనవడు తన తాతతో నీకు బాహుబలి సినిమా తెలుసా తాత.. పాన్ ఇండియా సినిమా గా విడుదలై ఎంత కలెక్షన్లు రాబట్టిందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలుసా నీకు అని అడగగా.. తాత నవ్వుతూ.. నాకు తెలిసిన ఒక పాన్ ఇండియా సినిమా ఒకటి ఉంది అది నీకు చెప్పనా అని అడిగాడు.. మనవడు నవ్వుతూ పాన్ ఇండియా సినిమా స్టార్ట్ అయిందే ఇప్పుడు తాత అంటాడు.. నాకు తెలిసిన పాన్ ఇండియా సినిమా చెప్తాను.. ఆ తర్వాత నువ్వే చెప్పు.. ఏది పాన్ ఇండియా సినిమానో.. నందమూరి తారక రామారావు నటించిన లవకుశ సినిమా నే మొదటి పాన్ ఇండియా సినిమా..!! ఈ సినిమా గురించి పూర్తి విశేషాలు ఇప్పుడు చెప్తా విను..!!

Pan India Movie: lavakusa by NTR
Pan India Movie: lavakusa by NTR

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది తారక రామారావు గురించి.. శ్రీ రాముడు అనే పౌరాణిక పాత్రలతో యావత్ భారతవని ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు ఆయన. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కళాఖండాలను రూపొందించిన ఘనచరిత్ర తారక రాముడిదే.. ఇదే అందులోని ఓ ఆణిముత్యమే లవకుశ.. శ్రీ రాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీ దేవి ఆ పాత్రల్లో ఒదిగి పోయారు.. గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా ఈ సినిమా క్లైమాక్స్ లో భూమి రెండుగా చీలి సీతాదేవి తల్లి గర్భం లోకి వెళ్లి పోయే సన్నివేశం హైలెట్ గా నిలిచిపోయింది. అలా భూమి విడిపోయే సన్నివేశం కోసం మట్టితో కూడిన వందల ట్రాలీలను లాగేవారు.. అప్పుడు భూమి మూడు భాగాలుగా విడిపోయినట్టు చూపించిన కెమెరా మెన్ పనితనం అమోఘం.. అప్పట్లో గేవా కలర్ లో సినిమా తీయాలంటే లైటింగ్ ఎక్కువగా ఉండాలి. దాంతో విపరీతమైన వేడి క్లోజప్ షాట్ లకైతే నటులు భరించడం కూడా డా కష్టమే అయినప్పటికీ ఎన్టీఆర్ లో ఓర్పు ఎక్కువగా దేనికీ భయపడలేదు. నటులంతా సహకరించడంతో సినిమా పూర్తై ఘన విజయం సాధించింది..

Pan India Movie: lavakusa by NTR
Pan India Movie: lavakusa by NTR

1963 మార్చి 29 న లవకుశ చిత్రం విడుదలైంది. 75 వారాలు ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. 62 కేంద్రాలలో శతదినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది.. లవకుశ 365 రోజులకు కోటి రూపాయలు సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా రికార్డులకెక్కింది.. అప్పట్లో సినిమా టికెట్ ధర కేవలం 25 పైసలు మాత్రమే. ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్ బోర్డ్ పడ్డాయి.. మా ఊరి జనమే కాక పక్క ఊరి జనం కూడా వచ్చి మళ్లీ మళ్లీ చూసేవారు. తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా జనం బళ్ళు కట్టుకుని మరీ థియేటర్లకు వెళ్లేవారు ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్ర ధరించి ఆంధ్రుల ఆరాధ్య దైవం గా నిలిచిపోయారు. లవకుశల వయసు మారిపోయిన జనం పట్టించుకోలేదు. లవకుశ సినిమా తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేసినప్పటికీ అక్కడి కూడా ఘన విజయం సాధించింది. ఈ ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డును సైతం ఈ సినిమా అందుకుంది.. ఇప్పుడు చెప్పరా మనవడా.. ఏది పాన్ ఇండియా సినిమా..!? అయినా తెలుగు రాష్ట్రాలలో రామాలయం లేని ఊరు లేదు.. లవకుశ పాటలు మోగని గుడి లేదు.. వాటిని వినని తెలుగు వాడు లేదనేది.. ఒక సామెత.. అయినా నువ్వేం చెప్పగలవులే.. అయినా చెప్తేంత వయసు, అనుభవం నీకు ఎక్కడ ఉన్నాయి.. అయినా ఇప్పుడు ఏదో బాహుబలి సినిమానే పాన్ ఇండియా సినిమా అని గుడ్డలు చించేసుకుంటున్నారు కానీ.. వాస్తవానికి తొలి పాన్ ఇండియా సినిమా లవకుశ గా చెప్పుకోవచ్చు..


Share

Related posts

తెలంగాణ లో పరుగులు పెడుతున్న ఆర్‌టి‌సి బస్సులు..

venkat mahesh

నందమూరి కుటుంబానికి పదవులు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి..??

sekhar

పెళ్ళాం మీద ఎంత ప్రేమరా నీకు .. ఆమెని ఒక్కమాట అన్నాడని ఏం చేశాడో చూడండి !

sekhar