Parpatakam: పర్పాటకం గురించి మీకు తెలుసా..!? దేనికి ఉపయోగపడుతుందంటే..!?

Share

Parpatakam: మనం చాలా రకాల మొక్కలు చూస్తూనే ఉంటాం.. వాటిలో కొన్ని ఔషధ గుణాలు కలిగినవి.. అయితే వాటిలో కొన్ని మొక్కల గురించి మనకు తెలియక కలుపు మొక్కలు గా భావిస్తాము.. ఇప్పుడు నేను చెప్పబోయే మొక్కను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. కాకపోతే దీనిలో దాగి ఉన్న ఔషధ గుణాలు గురించి ఎక్కువ మందికి తెలియదు.. అదే పర్పాటకం మొక్క..!! ఈ మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..!!

Excellent Health Benefits of Parpatakam: Plant
Excellent Health Benefits of Parpatakam: Plant

పర్పాటకం మొక్క రాళ్లలో, గోడల పక్కన, గోడల మధ్యన, వరిచేలలో, చెత్తకుప్పల వద్ద పెరుగుతుంది. ఈ మొక్కను పర్పాటకం, జాటరసి అని పిలుస్తారు. మన ఆయుర్వేద వైద్యంలో పూర్వ కాలం నుంచి ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కేరళ ఆయుర్వేదంలో ఈ మొక్కను హైపటైటిస్, న్యూమానియా, పాము కాటు విరుగుడుకు, కొలి సిస్టోసిస్, మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తున్నారు.

Excellent Health Benefits of Parpatakam: Plant
Excellent Health Benefits of Parpatakam: Plant

ఈ చెట్టు ఆకులు పచ్చివి లేదా ఎండినవి ఏవైనా పది ఆకులు తీసుకోవాలి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి కషాయాన్ని తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు మూడు సార్లు 250 ML తాగితే జ్వరము వెంటనే తగ్గిస్తుంది. డెంగ్యూ జ్వరం, చికెన్ గున్యా కూడా తగ్గిస్తుంది. జలుబు, జ్వరం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇంకా కామెర్లను కూడా నయం చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ ను క్రమబద్దీకరిస్తుంది. వాత కఫ దోషాలు సమతుల్యం చేస్తుంది. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని ఒక గ్లాసు మజ్జిగ లో కలుపుకుని తాగవచ్చు. కషాయం లేదా మజ్జిగలో కలుపుకుని తాగితే సమానమైన ఫలితాలను అందిస్తుంది.


Share

Related posts

షర్మిల ప్రేమ వ్యవహారం వల్ల మూడు సంవత్సరాలు నరకం అనుభవించాం : వై.ఎస్ విజయమ్మ

arun kanna

Sarada pitham: విశాఖ శారదా పీఠం అయ్యవారికి జగన్ పై కోపం వచ్చింది..! ఎందుకంటే..?

somaraju sharma

వెయ్యేళ్ల ముందే స‌ర్జ‌రీలు.. ఎక్కడ జరిగాయో తెలుసా?

Teja