NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

55 వేల మంది పోటీ పడితే.. మీకు రావాలంటే ఎలాగో చూడండి..!!

 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఐఐఎఫ్ టి ఎగ్జామ్ ను నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తుంది. మేనేజ్మెంట్ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోగల ప్రముఖ సంస్థల్లో ఒకటి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల పై ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి గమ్యం.

ఐఐఎఫ్ టి లో ప్రవేశానికి ప్రతి సంవత్సరం 55000 లకు పైగా అభ్యర్థులు పోటీ పడతారు. ఇందులో అర్హత సాధించిన వారు ఎంబీఏ ఐబి- ఇంటర్నేషనల్ బిజినెస్ లో ప్రవేశం పొందుతారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా మూడు క్యాంపస్ ల్లో ఢిల్లీ, కాకినాడ కోల్ కతా లో అడ్మిషన్ అవకాశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. కోర్ అంశాలతోపాటు ఎలక్టివ్ ను ఎంచుకోవచ్చు. విద్యార్థి కుటుంబ ఆదాయం రూ 6.50 లక్షల లోపు ఉన్నవారు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ :
సంస్థ వెబ్ సైట్ నందు దు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రుసుము 2500. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి వారికి రూ.1000. వెనుకబడిన వర్గాల వారు పది, ఇంటర్, డిగ్రీ, ఫోటో, సంతకం, ఉన్న వారు సంబంధిత పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
చివరి తేదీ : 20/12 /2020. పరీక్ష తేదీ : 24 01 20 21.
వెబ్సైట్ : http://www.iift.edu

అర్హతలు :
ఏదైనా డిగ్రీ లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి కి చెందిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు.

ప్రశ్నాపత్రం ఇలా :
ఇది కంప్యూటర్ ఆధార్ పరీక్ష. సమయం 2 గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అనాలసిస్, రీడింగ్ కాంప్రెహెన్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. విభాగం, అడిగే ప్రశ్నలు బట్టి మార్కుల్లో మార్పులు ఉంటాయి.

ఎంపిక విధానం :
ఈ పరీక్షలు మూడు దశల్లో నిర్వహిస్తారు. రిటెన్ ఎబిలిటీ టెస్ట్, బృంద చర్చ, వ్యక్తిగత ఇంటర్వ్యూ లలో సాధించిన స్కోరు ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఒక ఎస్సేను కూడా రాయాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారికి అందుబాటులో ఉన్న సీట్లు ఆధారంగా కట్ ఆఫ్ ను నిర్ణయిస్తారు. తరగతుల్లో అకడమిక్ పరంగా సాధించిన మార్కులు, కోర్సుల్లో వైవిధ్యం, లింగ వైవిధ్యం, పని అనుభవానికి మార్కులు ఇస్తారు. వీటిలో అర్హత సాధించాక బృంద చర్చను నిర్వహిస్తారు. దీనిలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, బృందంతో కలిసి పనిచేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై ఏ విధంగా స్పందిస్తున్నారు పరిశీలిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొత్తంగా సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎన్ఆర్ఐలకు జీ మ్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!