Official: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ. రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చల వేళ కీలక సమావేశం. ఇద్దరి మధ్య పొత్తుల పై కీలక ప్రకటనకు ఛాన్స్. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ భేటీలో కుప్పంలో పోలీసుల వైఖరి.. జీవో నెంబర్ 1 పై పోరాటం.. కలిసి ఉద్యమ ప్రణాళిక తో పాటు మరికొన్ని అంశాలపై చర్చలు జరిగాయి..

విశాఖలో కొద్ది నెలల క్రితం పవన్ ను పోలీసులు అడ్డుకోవటంతో, విజయవాడలో హోటల్ లో బస చేసిన పవన్ వద్దకు వెళ్లి చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. ఈ భేటీ కీలకంగా మారుతుంది. పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చి జీవో నెంబర్ 1 తో కుప్పంలో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. పోలీసుల పైన ఫైర్ అయ్యారు. తనను అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో చంద్రబాబును అడ్డుకోవటం పైన పవన్ సీరియస్ అయ్యారు.

ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. అంతకు ముందు విశాఖ పరిణామాల తరువాత తనకు చంద్రబాబు స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటించటంతో, ఇప్పుడు పవన్ కూడా కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబుకు అండగా నిలవాలని నేడు ఆయన ఇంటికి పవన్ వెళ్ళారు.. అయితే ఈ భేటీ లో అస్పష్టంగా ఉన్న పొత్తుల పైన ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఏపీలో రాజకీయ పరిణామల పైన చర్చిస్తున్నట్లు సమాచారం.