ట్రెండింగ్

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్ రికమండేషన్ ఒకే వేదికపై పవన్- మహేష్..??

Share

Sarkaru Vaari Paata: సినిమా ఇండస్ట్రీలో ఒకే వేదికపై పవన్, మహేష్ నీ చూడాలని చాలా మంది కోరిక. అయితే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ మొదటి నుండి ఉంది. ఆన్ స్క్రీన్ లో ఎప్పుడు కనబడలేదు. ఆఫ్ స్క్రీన్ పరంగా ప్రతి ఏటా క్రిస్మస్ పండుగకి లేదా తన ఫామ్ హౌస్ లో పండ్లు కాచిన టైంలో .. పార్సిల్ ఒకటి మహేష్ ఇంటికి పవన్ పంపించటం తెలిసిందే. తెలిసిన విషయం అయితే అర్జున్ సినిమా పైరసీ టైంలో మహేష్ బాబుని మొదటగా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్. ఇదంతా పక్కన పెడితే వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.pawan kalyan chief guest of sarkaru vaari paata movie pre release event

అయితే “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ని.. త్రివిక్రమ్ సాయంతో మహేష్ స్వయంగా పిలిచినట్లు పవన్ కూడా ఓకే అన్నట్లు సమాచారం. త్వరలోనే సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి పవన్ స్పెషల్ గెస్ట్ అనే వీడియో మేకర్స్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

pawan kalyan chief guest of sarkaru vaari paata movie pre release event

ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఎస్ ఎస్ రాజమౌళి కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో ఈ ఇద్దరు హీరోలను ఒకే వేదికపై చూడాలని ఇద్దరు హీరోల అభిమానులు అనుకుంటున్నారు. చాన్నాళ్లకు వాళ్ళ కోరిక నెరవేరుతున్నట్లూ వార్త రావడంతో..ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కరుణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా హీరోలు ఎవరికి వారు రిలీజవుతున్న సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ సినిమాకి పవన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share

Related posts

మజ్జిగ అన్నంలో ఉల్లిపాయ తింటే ఏం అవుతుందో తెలుసా..?

Teja

ఓమైగాడ్.. సుధీర్, రష్మీ జంటపై రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్

Varun G

వామ్మో.. ‘బొమ్మ అదిరింది’ షో రచ్చ మామూలుగా లేదుగా..!

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar