Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. ఇటీవల విడుదలై కలెక్షన్ ల సునామీ సృష్టిస్తోంది.. ఈ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నాడు పవన్.. దీంతో తన తర్వాత చిత్రాలకు మరింత క్రేజ్ పెరిగింది.. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా గురించి ట్రేండింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..
హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమాలో పవర్ స్టార్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అది కూడా తండ్రి కొడుకులుగా నటించనున్నారని.. ఈ న్యూస్ ఇండస్ట్రీ లో తెగ చెక్కర్లు కొడుతోంది.. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి కనువిందు చేయనున్నాడు.. ఈ చిత్రం లో తండ్రి పాత్రలో పోలీస్ గాను, కొడుకు పాత్రలో లెక్చరర్ గా నటిస్తున్నారని తాజా సమాచారం.. ఈ సినిమాకి “సంచారి” అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. కథ ప్రకారం ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించే సీన్స్ సినిమాలో హైలెట్ అని టాక్.. మరి ఈ విషయాల్లో వాస్తవాలు తెలియాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి మరి..
పవన్ కెరీర్ లో 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరముల్లు.. ఈ సినిమాలో హిస్టారికల్ హీరోగా, బందిపోటుగా కనిపించనున్నారు.. ఈ సినిమాలో పవన్ లుక్ ను పూర్తిగా మార్చేశారు క్రిష్.. పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కూడా చేస్తున్నారు.. ఈ చిత్రం లో పవన్ తో పాటు రానా కూడా అలరించనున్నారు.. మలయాళం లో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా ఈ సినిమా రానుంది.