Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇటీవల “వకీల్ సాబ్” తో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే హిట్ అందుకోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే అప్పటి తరం హీరోయిన్లు..ప్రస్తుతం ఒక్కొక్కరు మెల్లమెల్లగా రీ ఎంట్రీ ఇస్తున్న పరిస్థితి ఉంది. రమ్యకృష్ణ, మీనా, స్నేహ, భూమిక..ఇటీవల ఆమని వంటి అప్పటి స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో చిన్నపాటి అమ్మ గానీ అక్క లేదా వదిన పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పుడు ఇదే జాబితాలో కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో “గుడుంబా శంకర్” సినిమాలో నటించిన మీరా జాస్మిన్ చేరింది. మొదటి సినిమా అమ్మాయి బాగుంది తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ గుడుంబా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు పొందటం జరిగింది. అనంతరం రవితేజతో భద్ర సినిమాలో నటించి భారీ హిట్ ను అందుకుంది.
సౌత్ ఇండియాలో అనేక సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఇటీవల చాలా గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాల్లోకి రావడానికి రెడీ అయినట్లు ఇప్పటికే ఒక మలయాళ సినిమా లో గెస్ట్ రోల్ చేయటానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో తన కి తగ్గ పాత్రలు తెలుగులో వస్తే మళ్లీ నటించడానికి మీరా జాస్మిన్ రెడీ అన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్. సౌత్ ఇండియాలో అప్పట్లో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇవ్వడం తో ఈ వార్త సెన్సేషనల్ గా మారింది.