Payal Rajput : ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. ఈ సినిమా తో కుర్రాళ్ళ డ్రీం గర్ల్ గా మారిపోయింది పాయల్.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది..
తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా పాయల్ ఇన్స్టాగ్రామ్ లో మూడు మిలియన్స్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకొంది.. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంది.. ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది..
దానికి సంబంధించి పంచుకున్న ప్రతి పోస్ట్ ని లైక్ చేసి, షేర్ చేస్తున్న వారికి ధన్యవాదాలని.. తనపై ఇంతటి ప్రేమను చూపిస్తున్నందుకు రుణపడి ఉంటానని, అందుకు ధన్యవాదాలు తెలిపింది.. ఈ సపోర్ట్ మున్ముందు కూడా ఇలాగే కొనసాగించాలని చెప్పింది.. దీంతోపాటు స్మైల్ ఫర్ మైల్స్ అంటూ ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే మూడు మిలియన్స్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని మరో మైలురాయిని అధిగమించింది..