Payal Rajput: పాయల్ రాజ్ పుత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!!

Share

Payal Rajput: హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ “ఆర్ఎక్స్ 100” సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో తర్వాత అనేక అవకాశాలు అందుకున్న పాయల్… పెద్దగా గుర్తింపు దక్కించుకున్న సినిమాలు గాని విజయాలు గాని ఏమీ వరించలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో సరికొత్త బాంబు పేల్చింది.

Payal Rajput Exposes Her Relationship with Him

ఎన్ని సినిమాలు చేస్తున్నా గాని విజయాలు పెద్దగా వరించలేని పరిస్థితి ఉండటంతో… ముందు ముందు కెరియర్ ఏవిధంగా ఉంటుందో అన్న భయంతో.. పాయల్ రాజ్ పుత్ పెళ్లికి రెడీ అయిపోయింది. తన కాబోయే భర్త పేరు సౌరబ్ అని… పెళ్లి కూడా నిశ్చయం అయిపోయిందని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఇటీవల పాయల్ రాజ్ పుత్ కాబోయే వరుడు ప్రేమికుడు.. సౌరబ్ తల్లి కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియా సంస్థ తో పాయల్ రాజ్ పుత్ ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తల్లితో తనకు ఎంతగానో అనుబంధం ఉందని… ఆమె మరణం తనకు ఎంతగానో బాధను కలిగించింది అని గట్టిగా ఏడవాలని ఉందని స్పష్టం చేసింది.

 

సౌరబ్ ఇంట్లో తన ఇంట్లో అన్ని విషయాలు తెలిసిన పెళ్లికి పెద్దలు అంతా అంగీకరించారని పాయల్ రాజ్ పుత్ బాంబ్ పేల్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అప్పుడే పెళ్లి ఏంటి..?? అని ప్రశ్నలు వేస్తున్నారు, ఇంకా నీకు చాలా కారియర్ ఉంది కదా అంటూ తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క పాయల్ రాజ్ పుత్ తన కాబోయే భర్త ఫోటోలు రోజుకొకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంది.


Share

Related posts

Hanuman Real Photo: హనుమంతుడిని నిజంగా చూసి ఫోటో తీసినవ్యక్తి ఎలా చనిపోయాడొ తెలుసా?(Part 1)

Naina

బిగ్ బాస్ 4 : ఎవరూ చూడని ఎపిసోడ్ లో మోనాల్, హారిక ఏం చేస్తున్నారో చూడండి..! బెడ్ పై కౌగిలించుకొని….

arun kanna

వైఎస్ వివాకా కేసులో సిబిఐ కీలక ముందడుగు..! నేడు అతనిని విచారించనున్నారు

arun kanna