Pelli Sandadi: 25 సంవత్సరాల క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెళ్లి సందడి.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ తో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించింది.. ప్రస్తుతం రాఘవేంద్రుడి పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ శ్రీలీల జంటగా రూపొందుతున్న చిత్రం “పెళ్లి సందD”.. ఈరోజు రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండవ పాట “బుజ్జులు బుజ్జులు” సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్..

రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. కె కృష్ణ మోహన్ రావు సమర్పిస్తూ ఉండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి పెళ్లి సందడి సినిమా కి ఇది సీక్వెల్ కాదని ముందే చెప్పారు రాఘవేంద్రుడు. అయితే ఈ సినిమాతో ఆ సినిమా రికార్డులను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట ‘ప్రేమంటే ఏంటి’ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా రెండో పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలోని ప్రతి పాట ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు ఛాలెంజ్ గా తీసుకొని రూపొందిస్తున్నారు. “బుజ్జులు బుజ్జులు” సాంగ్ విడుదలైన కొద్దిసేపటిలోనే అద్భుతమైన వ్యూస్ ను సొంతం చేసుకుంది.. కేవలం పది నిమిషాల్లోనే 6వేల వ్యూస్ ను సొంతం చేసుకుంది..