Phone pay : కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది.. టెక్నాలజీ వాడకం అంటే ఇదే కాబోలు అనేలా పరిస్థితులు మారిపోయాయి.. స్మార్ట్ ఫోన్లు, జియో రాకతో డిజిటల్ పేమెంట్ లు పెరిగాయి.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న గల్లీలోని కిరణ షాప్స్ లో కూడా గూగుల్ పే, ఫోన్ పే లు వాడుతున్నారు.. ఇప్పుడు యాచకులు కూడా కొత్త ట్రెండ్ కు తెర తీశారు.. ఈ ట్రెండ్ ఎంటో ఆ లెక్కలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల, సంకీస గ్రామం లో గురువారం కొందరు హైటెక్ యాచకులు.. పైసలు లేకపోతే ఫోన్ పే చేయండి అంటూ క్యూ ఆర్ కోడ్ చూపిస్తూ పైసలడగడం కనిపించింది.. టెక్నాలజీ లో వచ్చిన మార్పులకు యాచకులు కూడా అప్డేట్ అయ్యారు..