కుమారి 21ఎఫ్ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన ముద్దుగుమ్మ హెబ్బాపటేల్ ఎంతో మంది విమర్శకుల ప్రశంసలను ఆ చిత్రంతో అందుకుంది. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడంలో విఫలం అయిన హెబ్బా పటేల్ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఎక్కువగా తనకు గ్లామర్ పాత్రలే వస్తున్నాయి.
ఆమె చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తర్వాత సఫలం అయినవి. వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. దీంతో ఆమెకు వచ్చిన క్రేజ్ మెల్లగా తగ్గిపోవడం మొదలైం. అయితే ఆమె చేస్తున్న సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెద్దగా కనిపించడం లేదు. ఇక ఒక రెండు సినిమాలతో మళ్ళీ సక్సెస్ కొడితే ఆమె మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే హెబ్బా కూడా వేచి ఉండి మంచి సినిమాల కోసం ఎదురు చూస్తోందట. గ్లామర్ కథకు అవసరమైతేనే పోషిస్తానని అనవసరంగా వచ్చి ఎక్స్పోజ్ చేసే ఉద్దేశంలో హెబ్బాపటేల్ లేదట.
కుమారి 21ఎఫ్ సినిమాలో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించిన హెబ్బాపటేల్ తర్వాత సినిమాకు కాస్త బొద్దుగా తయారైంది. తాజాగా ఓ ఫోటో లో చీర కట్టుకొని కాస్త లావుగా ఆంటీ కుమారి కనిపించడంతో ఏంటి మన హెబ్బా మరి ఇలా ఆంటిలా తయారయింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఒరేయ్ బుజ్జి గా’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమా ఫలితం పై తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి హెబ్బా మరో రెండు మూడు సినిమాలు కమిట్ అయింది అయితే అవి ఎప్పటికీ మొదలవుతాయో తెలియదు. ఈ లోపల మాత్రం బొద్దుగా తయారయి హెబ్బా ఆంటీలా కనపడటంతో ఫ్యాన్స్ గుండెల్లో ఒక్కసారిగా చివుక్కుమంది.