Plane Crash: ఏ బంధమైనా మధ్యలో తెగిపోవచ్చు కానీ.. స్నేహం కడవరకు సాగుతుందంటారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే నేపాల్ విమాన ప్రయాణంలో ఐదుగురు ప్రాణ స్నేహితులు మరణంలోనూ కలిసే ఉన్నారు.. విమానంలో ప్రయాణిస్తుండగా వారి సంతోష సమయాలను వారు తమ మిత్రులతో ఫేస్ బుక్ లైవ్ చేస్తుండగా క్షణాల్లో అంతా జరిగిపోయింది..

తమ టూర్ ఎలా సాగుతుందో అంతా మిగిలిన మిత్రులకు ఫేస్బుక్ ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఇదే వారి చివర యాత్ర అవుతుందని ఫేస్బుక్ లైవ్ చూస్తున్న మిత్రులకు తెలియదు.. చేస్తున్న ఆ ఐదుగురికి తెలియదు. కానీ వారి స్నేహం చావులో కూడా కలిసే సాగింది. వారు అగ్నికి ఆహుతిలైన లైవ్ మాత్రం అలానే కొనసాగింది. నేపాల్ ఖాట్మండు నుంచి పోకారా వెళుతున్న జ్యోతి ఎయిర్ లైన్స్ విమానం ఘోర ప్రమాదంలో వీరంతా చనిపోయారు. నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ దేశ రాజధాని ఖాట్మండు నుంచి పోకారా వెళుతున్న విమానం ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయ్యింది. విమాన ప్రమాదంలో 72 మంది చనిపోయారు. 68 మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు . మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
ప్రమాదానికి ముందు విమానం గాలిలో చెక్కర్లు కొట్టడం వీరు తమ ఫేస్బుక్ లైవ్ వీడియో చిత్రీకరించారు. ల్యాండింగ్ కు కేవలం 10 సెకండ్ల ముందు అంటే ప్లైన్ క్రాష్ జరగడానికి సరిగ్గా ముందు కూడా వీరు వీడియో తీశారు. ఈ ప్రమాదంలో ఘాజీపూర్ కి చెందిన ఐదుగురు మృతి చెందారు. అనిల్ రాజ్ బార్, విశాల్ శర్మ, అభిషేక్ కుశ్వాహ, సోను జైస్వాల్, సంజయ్ జయ్శ్వర్ ప్రమాదానికి ముందు వారిలో ఒకరు ఫేస్బుక్ లైవ్ కూడా చేశారు. ఈ యువకులంతా ఘాజీపూర్ లోని అలగ్పూర్ ధార్వా గ్రామీణ యువకులు . ప్రమాదానికి ముందు సోను జయసుధ విమానం లోపల ఫేస్బుక్లో లైక్ చేశారు. అదే సమయంలో విమానం కూలిపోయింది. దీనికి వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.