ట్రెండింగ్

Bigg Boss 3: దయచేసి ఆ వార్తలను నమ్మకండి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివజ్యోతి రిక్వెస్ట్..!!

Share

Bigg Boss 3: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ త్రీలో హైలెట్ అయిన వారిలో శివ జ్యోతి ఒకరు. ఆ సీజన్ లో చాలామందికి మంచి పోటీ ఇవ్వటం జరిగింది. కండలు కలిగిన మగవాళ్ళకి కూడా పోటీ చేస్తూ శివ జ్యోతి డేరింగ్ అండ్ డాషింగ్ గేమ్ ఆడి.. టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచింది. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా సోలో పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సిన సమయంలో… నామినేషన్ టైంలో శివ జ్యోతి చాలా క్లారిటీ గా ఉండేది. అయితే ఆ సీజన్ అయ్యాక మంచి గుర్తింపు దక్కడంతో.. టీవీ9 న్యూస్ ఛానల్ లో… ఇంకా పలు టెలివిజన్ షోలలో విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తోంది. అంతే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు.. తన కెరీర్ గురించి ప్రేక్షకులతో పలు విషయాలు పంచుకుంటూ ఉంటది.Bigg Boss Telugu 3, Day 98: Siva Jyothi gets eliminated; 5 finalists of the  season revealed - Times of Indiaపరిస్థితి ఇలా ఉంటే ఇటీవల శివజ్యోతి ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఆమె రియక్ట్ అయింది. శివ జ్యోతి వీడియో లో మాట్లాడుతూ…’ నా గురించి నాకు తెలియకుండానే కొన్ని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఓ ఈవెంట్ కి వెళ్లిన సమయంలో మామిడికాయతో ఫోటో పెట్టా. ఇక అంతే అప్పటి నుండి నేను ప్రెగ్నెంట్ అంటూ… ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. వ్యూస్ కోసం కక్కుర్తిపడి ఇష్టం వచ్చినట్లు…థంబ్ నైల్స్ కూడా వేస్తున్నారు. వ్యక్తిగతంగా ఇంకా కెరియర్ పరంగా… ఈ న్యూస్ చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయింది. మా పిల్లల కోసం.. మా కుటుంబం అంతా ఎంతో ఎదురు చూస్తూ ఉంది.Shiva Jyothi Wiki, Age, Boyfriend, Husband, Family, Biography & Moreనేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇది ఎమోషనల్ గా ఎంత బాధ పెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్ లు చెయ్యనేమో అని చాలా మంది వెనక్కి వెళ్ళి పోతున్నారు. ఇటువంటి వార్తల వల్ల నా వర్క్ దెబ్బతింటుంది. ఇందులో నా స్నేహితులను కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్న దయచేసి ఇటువంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దు. ప్రెగ్నెన్సీ అనేది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్ లో ఆ గుడ్ న్యూస్ ఉంటే నేనే మీ అందరితో ముందుగా షేర్ చేస్తాను. ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి అంటూ శివ జ్యోతి రిక్వెస్ట్ చేసింది.


Share

Related posts

Curry Leaves Tea: ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ తాగితే బరువు తగ్గుతారట..!!

bharani jella

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : రకుల్ ప్రీత్ సింగ్ నిజం ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది ??

arun kanna

సుశాంత్ పై ప్లేటు ఫిరాయించిన రియా.. అతనే డ్రగ్స్ కి బానిసై నన్ను వాడుకున్నాడు!

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar