Narendra Modi: ప్రధాని మెచ్చిన వీడియో..!! నరేంద్ర మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్ ఎంతో తెలుసా..!! 

Share

Narendra Modi:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు తెలియజేస్తూ ఉంటారు.. ప్రతి నిత్యం ఏదో విషయం పై ఆయన స్పందిస్తూ ఉంటారు.. గుజరాత్ రాష్ట్రంలోని అడవిలో 3 వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను గుజరాత్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో షేర్ చేసింది.. ఈ వీడియోపై మోడీ స్పందించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వీడియోపై అద్భుతం అని ట్వీట్ చేశారు..!!

PM Narendra Modi: Retweet Excellent video viral on social media
PM Narendra Modi: Retweet Excellent video viral on social media

గుజరాత్ లోని భావనగర్ లో గల కృష్ణజింకల జాతీయ పార్క్ లో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో చెంగు చెంగున ఎగురుతూ రోడ్డు దాటుతున్న వీడియో మోడీ అద్భుతం అని షేర్ చేయడంతో అందర్నీ ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఈ వీడియో పై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో ను 72 వేల మంది లైక్ చేయగా పదివేల మంది షేర్ చేశారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటువంటి మంచి అంశాలపై స్పందిస్తారు కాబట్టే తన ట్విట్టర్ ఖాతాలో 70 మిలియన్ల ఫాలోవర్ లను సొంతం చేసుకోగలిగారు.


Share

Related posts

సంవత్సరంలో హనుమాన్ జయంతిని అన్ని సార్లు ఎందుకు జరుపుకుంటారు?

Teja

రోహిత్ హాఫ్ సెంచరీ

Siva Prasad

SLEEPING: రాత్రి సమయంలో నిద్రపట్టడం లేదా.. ఇది మీ కోసమే..!

Ram